టీడీపీ - జనసేన పొత్తు ...? సీట్ల సర్దుబాటు జరిగిపోయిందా..?

ఏపీలో రాజకీయాలు రాజకీయ పార్టీల వ్యూహాలు ఎవరికీ అంతుపట్టని విధంగా మారాయి.ఈ ఎన్నికల్లో ఏ పార్టీతో ఏ పార్టీ పొత్తు పెట్టుకుంటుంది…? ఏ విధంగా ముందుకు వెళ్తుందో ఎవరికీ అర్థం కాకుండా ఉంది.2014 ఎన్నికల్లో టిడిపీ కి సపోర్ట్ గా బిజెపి జనసేన పార్టీలు ఉన్నాయి.అయితే ఆ తరువాత మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఆ రెండు పార్టీలు టిడిపీ కి దూరం అయ్యాయి.

 Is Janasena And Tdp Tie Up Is Fixed-TeluguStop.com

అయితే అంతకు ముందు టిడిపితో కలిసి జతకట్టిన వామపక్ష పార్టీలు కూడా ఈసారి జనసేన వైపు చూస్తున్నాయి.ఇదే సమయంలో ప్రతిపక్ష వైసీపీ పార్టీ ఏపీలో బాగా… బలం పుంజుకోవడంతో ఎన్నికల్లో గట్టెక్కేందుకు చంద్రబాబు రకరకాల ఆలోచనలు చేస్తూ… సరికొత్త వ్యూహాలు పన్నే పనిలో నిమగ్నమయ్యాడు.

ఇక జనసేన విషయానికి వస్తే …ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఈ ఎన్నికల్లో ఒంటరిగా బరిలోకి వెళ్తానని బహిరంగంగానే చెప్పాడు.అయితే ప్రస్తుత రాజకీయ పరిస్థితులు జనసేన లో ఒక రకమైన ఆందోళన కలిగిస్తున్నాయి.సంస్థాగతంగా ఇప్పటికీ జనసేన బలపడకపోవడంతో… ఈ ఎన్నికల్లో 175 స్థానాల్లో పోటీ చేస్తే గట్టిగా ఎదురు దెబ్బ తగులుతుందని పవన్ లోలోపల ఆందోళన చెందుతున్నారు.అయితే పైకి మాత్రం టిడిపి కూడా ఇదే ఆందోళనలో ఉంది.

సంస్థాగతంగా టీడీపీ బలంగా ఉన్నా… ప్రభుత్వం పై వ్యతిరేకత ఉండడంతో… కనిపిస్తుంది.అయితే ఈ రెండు పార్టీలు కూడా పైకి ధైర్యంగా కనిపిస్తున్నాయి.

ఈ నేపథ్యంలో జనసేన- టిడిపి రెండు పార్టీలు ఈ ఎన్నికల్లో పొత్తు పెట్టుకుని ఎన్నికల్లో ముందుకు వెళ్తే ఎలా ఉంటుంది అనే ఆలోచనలో పడినట్టు తెలుస్తోంది.

దీనిపై మీడియాలో కూడా ఓ కథనం వెలువడింది.ఇప్పటికే సీట్ల సర్దుబాటు కూడా పూర్తయిందని ఆ పత్రిక వివరించింది.25 ఎమ్మెల్యే, 3 ఎంపీ సీట్లు పవన్‌ కల్యాణ్‌కు ఇచ్చేందుకు ఒప్పందం కుదిరినట్టు ఆ కథనం లో పేర్కొన్నారు.ఈసారి కూడా పవన్, చంద్రబాబు భేటీకి కరకట్ట భవన నిర్మాత లింగమనేని రమేషే మధ్యవర్తిత్వం వహించారని పేర్కొన్నారు.అంతే కాకుండా….ఎవరు ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలన్న దానితో పాటు.ఎక్కడెక్కడ పోటీ చేయాలన్న విషయం పైనా చంద్రబాబు, పవన్‌ కల్యాణ్ లోతుగా చర్చించారట.

కాకపోతే నిన్నటివరకు తిట్టుకుని ఇప్పుడు పొత్తు అంటే ….ప్రజల్లో చులకన అవుతామని ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.

అందుకే ఈ విషయంలో ప్రజల్లో చులకన అవ్వకుండా….జాగ్రత్తగా వ్యవహారం నడపాలని చూస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube