హిందీలో రీమేక్ కానున్న చియాన్ విక్రమ్ సినిమా!

సౌత్ సినిమాలపై బాలీవుడ్ సెలబ్రేటీలు, అలాగే ఆక్కడ ప్రేక్షకులు చాలా ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ వుంటారు.ముఖ్యంగా సౌత్ లో వచ్చే మాస్ మసాలా సినిమాలు అంటే బాలీవుడ్ లో విపరీతమైన క్రేజ్ వుంది.

 Vikram Super Hit Movie Going To Remake In Bollywood-TeluguStop.com

అలాగే సౌత్ లో వచ్చే డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాలు కూడా బాలీవుడ్ ప్రేక్షకులు ఆదరిస్తూ వుంటారు.ఈ కారణంగా బాలీవుడ్ హీరోలు, దర్శకులు సైతం సౌత్ చిత్రాలని రీమేక్ చేసి సక్సెస్ కొట్టాలని ప్రయత్నం చేస్తూ వుంటారు.

ఇప్పటికే చాలా సౌత్ సినిమాలో బాలీవుడ్ లో రీమేక్ అయ్యి మంచి హిట్స్ అయ్యాయి.ఇప్పుడు మరో తమిళ బ్లాక్ బస్టర్ మూవీ ని బాలీవుడ్ లో రీమేక్ చేయడానికి సిద్ధం అవుతున్నారు.

దశాబ్దం క్రితం తమిళంలో బాలా దర్శకత్వంలో చియాన్ విక్రమ్ హీరోగా పితామగన్ అనే సినిమా వచ్చింది.ఇది తెలుగులో శివపుత్రుడు పేరుతో డబ్బింగ్ అయ్యింది.ఈ సినిమా రెండు చోట్ల సూపర్ హిట్ టాక్ తెచ్చుకోవడంతో పాటు విక్రమ్ కెరియర్ ని టర్న్ చేసిన చిత్రంగా నిలిచిపోయింది.ఇందులో విక్రమ్ తో పాటు హీరో సూర్య కూడా నటించాడు.

ఓ విధంగా చెప్పాలంటే ఇది మల్టీ స్టారర్ మూవీ.ఇదిలా వుంటే ఎన్నేళ్ళ తర్వాత మరల ఈ సినిమాని బాలీవుడ్ లో రీమేక్ చేయడానికి ప్రముఖ దర్శకుడు సతీష్ కౌశిక్ రెడీ అవుతున్నారు.

ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన రీమేక్ రైట్స్ ని కూడా సతీష్ సొంతం చేసుకున్నట్లు తెలుస్తుంది.మరి బాలీవుడ్ లో ఈ సినిమాని దర్శకుడు ఎ హీరోతో తెరకెక్కిస్తాడు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube