హైదరాబాదీ ప్యారడైజ్‌ బిర్యానీకి అరుదైన గౌరవం.. 70 లక్షలతో రికార్డ్‌, తెలుగు వారు గర్వించదగ్గ విషయం

దేశంలో ఎన్నో చోట్ల బిర్యానీ పాయింట్లు, హోటల్లు ఉంటాయి.విదేశాల్లో కూడా బిర్యానీ ఉంటుంది.

 Hyderabadi Paradise Biryani Got Place In Limca Of Records-TeluguStop.com

కాని ఎక్కడ ఉన్నా, ఎంత ఎక్కువ రేటు పెట్టి తిన్నా కూడా ప్యారడైజ్‌ బిర్యానీ టేస్ట్‌ దేనికి రాదు అనేది ఆ బిర్యానీ తినే వారి మాట.సికింద్రాబాద్‌లోని ప్యారడైజ్‌ బిర్యానీ సెంటర్‌లో రోజుకు కొన్ని వేల బిర్యానీ ప్యాట్లు అమ్ముడు పోతు ఉంటాయి.ప్యారడైజ్‌ బిర్యానీ సెంటర్‌కు దాదాపుగా 37 బ్రాంచ్‌లు ఉన్నాయి.

ఈ బ్రాంచ్‌లన్నింటిలో కలిపి గత ఏడాది ఏకంగా 70 లక్షల బిర్యానీలు అమ్మారట.ఒకే ఏడాది ఈ స్థాయిలో బిర్యానీలు అమ్మడం అంటే మామూలు విషయం కాదు.

70 లక్షల బిర్యానీలు అమ్మినందుకు గాను ప్యారడైజ్‌ బిర్యానీ సెంటర్‌కు లిమ్కా బుక్‌ ఆఫ్‌ ది రికార్డ్‌ దక్కింది.ఈ రికార్డుతో ప్యారడైజ్‌ క్రేజ్‌ మరింతగా పెరిగింది.హైదరాబాద్‌లో ఉండి ప్యారడైజ్‌ బిర్యానీ తినని వారు ఉండరు.ఇక వేరే రాష్ట్రాల నుండి, వేరే దేశాల నుండి వచ్చే వారు ప్రత్యేకంగా ప్యారడైజ్‌ బిర్యానీ తినేందుకు ఆసక్తి చూపడం జరుగుతుంది.

హైదరాబాద్‌లో ఎన్ని బిర్యానీ సెంటర్‌లు ఉన్నా కూడా ప్యారడైజ్‌ బిర్యానీ సెంటర్‌లోనే అత్యధికంగా బిర్యానీ అమ్ముడు పోతుందని ఈ రికార్డు ద్వారా తేలిపోయింది.బావర్చితో పాటు ఇంకా ప్రముఖ హోటల్స్‌ ఉన్నా కూడా ప్యారడైజ్‌లోనే బిర్యానీ తినాలని జనాలు ఉవ్విల్లూరుతూ ఉన్నారు.

ప్యారడైజ్‌ బిర్యాని టేస్ట్‌తో పాటు, క్వాలిటీ కూడా మెయింటెన్‌ చేస్తారు.

శుభ్రమైన పదార్థాలతో, విభిన్నమైన రుచితో బిర్యానీ ఉంటుంది.అందుకే ప్యారడైజ్‌ బిర్యానీ అంటే జనాలు నాలుక కోసుకుంటారు.

ప్యారడైజ్‌ బిర్యానికి వచ్చిన ఘనతతో ఆ సంస్థ ప్రతినిధులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.

ఇక ప్యారడైజ్‌ సంస్థ అధినేత అలీ హేమతికి లైఫ్‌ టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డును ఫుడ్‌ కాంగ్రెస్‌ ఇచ్చింది.అరుదైన ఘనత దక్కిన నేపథ్యంలో ప్యారడైజ్‌ను మరింత ముందుకు తీసుకు వెళ్తామని, దేశంలో ఇంకా చాలా బ్రాంచ్‌లు ఏర్పాటు చేయడంతో పాటు, ప్రంపంచ దేశాల్లో కూడా ప్యారడైజ్‌ బ్రాంచ్‌లను ఏర్పాటు చేయబోతున్నట్లుగా సంస్థ ప్రతినిధులు ప్రకటించారు.వచ్చే ఏడాది కోటి టార్గెట్‌గా పని చేస్తామంటూ ప్యారడైజ్‌ సంస్థ సీఈఓ అన్నారు.

రాబోయే 5 ఏళ్లలో సంస్థ బ్రాంచీలను 100 కు పెంచే యోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube