టీడీపీ అభ్యర్ధులని ఖరారు చేస్తున్న చంద్రబాబు! ఎన్నికలపై కసరత్తు!

ఎన్నికల నోటిఫికేషన్ మరో నెల రోజులలో అమలులోకి వచ్చే అవకాశం వుంది.ఇప్పటికే ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ ని ఎన్నికల సంఘం రిలీజ్ చేసింది.

 Chandrababu Announced Contestants Name For 2019 Elections-TeluguStop.com

ఎమ్మెల్సీ ఎన్నికలు పూర్తి కాగానే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేసే అవకాశం వున్నట్లు కనిపిస్తుంది.ఈ నేపధ్యంలో అధికార పార్టీ టీడీపీ అందరికంటే ముందుగానే ఎన్నికల కోసం అభ్యర్ధులని ఎంపిక చేసే ప్రయత్నం మొదలుపెట్టింది.

ఇప్పటి వరకు పరిపాలన, సంక్షేమ కార్యక్రమాలపై ద్రుష్టి పెట్టిన చంద్రబాబు, పూర్తి స్థాయిలో అభ్యర్ధుల ఎంపికపై కసరత్తు మొదలు పెట్టి నియోజక వర్గాల వారీగా సమీక్ష సమావేశాలు నిర్వహిస్తూ, ఆయా నియోజక వర్గాలలో ఈ సారి ఎమ్మెల్యే అభ్యర్ధులుగా ఎవరు పోటీ చేయబోతున్నారు అనే విషయాన్ని స్పష్టత ఇచ్చేస్తున్నారు.దీంతో పార్టీ క్యాడర్ కొంత ఉత్సాహంగా వుంది.

ఇప్పటికే విజయవాడ, కృష్ణ, గుంటూరు, చిత్తూరు, నెల్లూరు జిల్లాల పరిధిలో కీలకమైన స్థానాలకి అభ్యర్ధులని చంద్రబాబు ప్రకటించారు.మచిలీ పట్నం, అవనిగడ్డ, కడప, బద్వేల్, జమ్మల మడుగు, పులివెందుల, మైదుకూరు, కమలాపురం, రాజంపేట, రాయచోటి, రైల్వే కోడూరు, పుంగనూరు, పీలేరు, మైలవరం, విజయవాడ ఈస్ట్, విజయవాడ వెస్ట్, నందిగామ, జగ్గయ్య పేట, పెనమలూరు, గన్నవరం, మచిలీపట్నం అసెంబ్లీ స్థానాలకి ముఖ్యమంత్రి చంద్రబాబు అభ్యర్ధులని ఖారారు చేసారు.

వీరిలో చాలా మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలుగా, అలాగే గతంలో పోటీ చేసిన వారే వున్నట్లు తెలుస్తుంది.ఇక కర్నూల్ పరిధిలో నియోజక వర్గాలలో అభ్యర్ధులని కూడా చంద్రబాబు ఈ రోజు ఖరారు చేసే అవకాశం వున్నట్లు తెలుస్తుంది.

మొత్తానికి ఎన్నికల రణరంగానికి చంద్రబాబు ముందస్తుగానే కసరత్తు మొదలెట్టి, బలమైన అభ్యర్ధులని ఎంపిక చేయడంతో పాటు, నియోజక వర్గాలలో అభ్యర్ధులని వేగంగా ప్రజలకి చేరువ చేసే ప్రయత్నం చేస్తున్నారని తెలుస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube