850 మంది భారత ఖైదీలకి విముక్తి

దాదాపు 850 మంది భారతీయ ఖైదీలకి సౌదీలో ఉండే జైళ్ళ నుంచీ విముక్తి లభించింది.సౌదీ యువరాజు మహ్మద్ బిల్ భారత్ లో పర్యటిస్తున్న సంగతి అందరికి తెలిసిందే అయితే.

 Saudi Crown Prince Orders Release Of 850 Indian Prisoners-TeluguStop.com

ఆయన్ని ప్రధాని మోడీ ఎంతో సాదరంగా ఆహ్వానించారు.మోడీ స్వయంగా విమానాశ్రయానికి వెళ్లి మరీ స్వగతం పలికారు.

ఆ తరువాత ఇద్దరు కలిసి ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక చర్చలు జరిపారు…ఈ క్రమంలోనే ప్రధాని సౌదీ రాజుని వివిధ సౌదీ లోని వివిధ జైళ్ళల్లో మగ్గుతున్న సుమారు ఏకంగా 850 మంది ఖైదీలను విడుదల చేయాల్సిందిగా కోరడంతో వెంటనే యువరాజు అందుకు తగ్గట్టుగా సానుకూల స్పందన తెలిపారని తెలుస్తోంది.

అంతేకాదు ఇప్పటివరకూ లక్షా 75 వేలుగా ఉన్న భారత్ హాజ్ యాత్రికుల కోటా సంఖ్యని సైతం రెండు లక్షలకి పెంచారు కూడా.అయితే భారత్ లో పర్యటనకి కంటే ముందు ఆయన పాకిస్తాన్ లో పర్యటించిన విషయం అందరికి తెలిసిందే అక్కడ కూడా దాదాపు 2000 మంది పాకిస్తాన్ ఖైదీలని విడుదల చేస్తున్నట్టుగా ఆయన ప్రకటించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube