అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో నేనూ ఉన్నా..!!!

అమెరికా అధ్యక్ష ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ఆ స్థానానికి పోటీ పడే వారి సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతూ ఉంది.ఇప్పటికే తామున్నమంటే తామున్నమంటూ డెమోక్రటిక్ పార్టీ తరుపున ఇద్దరు ఇండో అమెరికన్స్ పోటీ పడుతూ తమ తమ ఎన్నికల ప్రచారాన్ని ఇప్పటికే మొదలు పెట్టేశారు .అయితే తాజాగా నేను కూడా అధ్యక్ష బరిలో ఉన్నానంటూ 2016 లో డెమోక్రటిక్ పార్టీ తరుపున అప్పటి ఎన్నికల్లో బరిలోకి దిగిన

 Bernie Sanders Is Also In The Race Of American President-TeluguStop.com

సెనెటర్‌ బెర్నీ శాండర్స్‌ ప్రకటించారు…గతంలో బరిలోకి దిగి గట్టి పోటీని ఇచ్చిన ఇచ్చిన శాండర్స్‌ మరోసారి పోటీలో నిలుస్తున్నారు.తన సొంత రాష్ట్రం అయిన వెర్మాంట్‌లో రేడియో ఇంటర్వ్యూ ఇస్తూ ఆయన ఈ విషయాన్ని ప్రకటించారు.తన రాష్ట్ర పరకలు ఈ విషయాన్ని తెలుసుకోవాలని కోరుకుంటున్నట్టుగా తెలిపారు.

వచ్చే ఎన్నికలలో తానూ ఎలా ప్రచారం చేయబోయేది కూడా వివరించి చెప్పారు.

న్యాయం పట్ల, కమ్యూనిటీ పట్ల కిందిస్థాయి రాజకీయాల పట్ల అత్యంత నమ్మకం ఉండాలనేది తను నమ్ముతానని ఇదే విలువలని దేశవ్యాప్తంగా ప్రచారం చేస్తానని ఆయన అన్నారు.పనిలో పనిగా ట్రంప్ పై విమర్శలు సంధించారు.

ట్రంప్ ఓ అబద్దాల పుట్ట అంటూ ఆయన వ్యాఖ్యలు చేశారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube