పవన్ మౌనానికి కారణం ఏమిటి...? పార్టీలో జరుగుతుందేంటి..?

పవన్ కళ్యాణ్ …ఈ పేరుకు ఏపీలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉంది.దేశ విదేశాల్లో ఎంతో క్రేజ్ ఉంది పవర్ స్టార్ గా సినిమాల్లో ఆయన నటనకు అంతా ప్రశంసలు కురిపిస్తూ ఉంటారు ఇక యూత్ లో అయితే ఆయన కున్న క్రేజే వేరు ఆ క్రేజ్ తోనే రాజకీయాల్లో రాణించేందుకు జనసేన పేరుతో పవన్ రాజకీయ పార్టీని పెట్టి ప్రజల ముంచుకు వచ్చాడు.

 Why Pawan Kalyan Janasena Is Silent What Is Going In The Party-TeluguStop.com

గత ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ పార్టీలకు మద్దతుగా… ప్రచారం చేసి ఆ పార్టీలు అధికారంలోకి రావడానికి దోహదపడ్డాడు.అయితే ప్రస్తుతం సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా పవన్ తన పార్టీని ముందుకు తీసుకువెళ్తున్నాడు.

ఇంత వరకు బాగానే ఉన్నా… ఎన్నికలకు సమయం దగ్గరకు వచ్చేస్తున్న తరుణంలో పవన్ సైలెంట్ అయిపోవడం వెనుక కారణం ఏంటో మాత్రం తెలియడంలేదు.

పోరాట యాత్ర పేరుతో హడావుడి చేసిన పవన్ కొత్త సంవచ్ఛరంలో ఆ యాత్రలకు బ్రేక్ చెప్పేసాడు.ఎన్నికల సమయం దగ్గరకు వచ్చేస్తున్న తరుణంలో టీడీపీ , వైసీపీ పార్టీలు పోటీ పడి మరీ హామీల వర్షంలో ప్రజలను తడిపేస్తుంటే… పవన్ మాత్రం ఆ రేస్ లో వెనకబడిపోయినట్టు కనిపిస్తున్నాడు.పూర్తిగా పార్టీ కార్యక్రమాలకే పరిమితం … అవుతున్నారు.

మరోవైపు స్క్రీనింగ్ కమిటీ అని ఒకటి పెట్టి అభ్యర్థుల నుండి దరఖాస్తులు తీసుకుంటున్నారు.వస్తున్న వారంతా కొత్త వారే.

ప్రస్తుతం పవన్ పార్టీలో పోటీ చేసేందుకు చూస్తున్నవారంతా కొత్తవారే.బలమైన టీడీపీ, వైసీపీ అభ్యర్థులను వీరు సొంతంగా ఎదుర్కోవడం కష్టం.

ఈ తరుణంలో పవన్ పార్టీ మైలేజ్ పెరిగేలా ఆ రెండు పార్టీలకు ధీటుగా హామీలు ఇస్తే కానీ గట్టి పోటీ ఇచ్చే పరిస్థితి కనిపించడంలేదు.

పవన్ పార్టీలు ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు గందరగోళంగా ఉండడంతో… సహజంగా వేరే పార్టీల నుండి వచ్చే నాయకులు కూడా జనసేన వైపు చూడటం మానేశారు.ముందు పార్టీ లో చేరదాం .అనుకున్న నేతలు కూడా ఇప్పుడు వేరే దారులు వెతుక్కునే పరిస్థితి.దీనితో అసలు జనసేన మొత్తం 175 నియోజకవర్గాలలో అభ్యర్థులను పెట్టగలదా ? అనే అనుమానాలు అందరికి కలుగుతున్నాయి.జనసేన ప్రభావం కేవలం ఉత్తరాంధ్రా, గోదావరి జిల్లాలు, కృష్ణ, గుంటూరులో మాత్రమే ఉంటుందని ప్రచారం జరిగినా ఆ పార్టీకి గట్టిగా మాట్లాడలేని పరిస్థితి.అలాగే… ఈ ఎన్నికల్లో జనసేన ఒంటరిగా బరిలోకి వెళ్లాడని… ఖచ్చితంగా ఏదో ఒక పార్టీతో పొత్తు పెట్టుకుని కేవలం 30 స్థానాల్లో మాత్రమే పోటీ చేస్తుందనే వార్తలు వస్తున్నా….జనసేన అధినేత మౌనంగానే ఉండడం పార్టీ నాయకులకు మింగుడుపడడం లేదు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube