మన్మధుడితో అన్నారు, ఇప్పుడు వెంకీ మామతో అంటున్నారు.. ఏది నిజం?

ఆర్‌ఎక్స్‌ 100 చిత్రంలో హీరోను మోసం చేసి అతడు చనిపోయలా చేసి అందరి దృష్టిని ఆకర్షించిన ముద్దుగుమ్మ పాయల్‌ రాజ్‌పూత్‌.మొదటి సినిమాలోనే నెగటివ్‌ ఛాయలు ఉన్న పాత్రను చేయడం అంటే మామూలు విషయం కాదు.

 Payal Rajput Anged For Venky Mama Movie For Venki-TeluguStop.com

భారీ క్రేజ్‌ను దక్కించుకున్న ముద్దుగుమ్మ పాయల్‌ రాజ్‌పూత్‌కు మంచి ఆఫర్లు వచ్చాయి.అయితే మొదటి సినిమాలో బోల్డ్‌ కంటెంట్‌ ఉన్న పాత్రను చేసిన కారణంగా ఆమెకు అన్ని కూడా అలాంటి ఆఫర్లు వచ్చాయి.

కాని పాయల్‌ మాత్రం ఆ పాత్రలకు నో చెప్పింది.ఎట్టకేలకు ఈ అమ్మడు ఒక చిత్రానికి కమిట్‌ అయ్యిందని వార్తలు వచ్చాయి.

నాగార్జున మన్మధుడు 2 చిత్రంలో ఈమె ఒక హీరోయిన్‌గా నటించబోతున్నట్లుగా ప్రచారం జరిగింది.అయితే ఆ వార్తలు కేవలం పుకార్లే అని తేలిపోయింది.అసలు తనను మన్మధుడు 2 చిత్రం కోసం ఎవరు సంప్రదించలేదని, తనకు ఆ ఆఫర్‌ వస్తే నటిస్తాను అంటూ చెప్పుకొచ్చింది.కాని సినీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఈమెను సంప్రదించిన మాట వాస్తవమే కాని, ఆమెను ఆ తర్వాత వద్దనుకున్నట్లుగా తెలుస్తోంది.

ఇక ఈ సమయంలోనే ఈమెకు వెంకీ మామ నుండి పిలుపు వచ్చినట్లుగా వార్తలు వస్తున్నాయి.

వెంకటేష్‌ మరియు నాగచైతన్యలు కలిసి నటిస్తున్న ‘వెంకీ మామ’ చిత్రంకు బాబీ దర్శకత్వం వహిస్తున్నాడు.అంచనాలు భారీ స్థాయిలో ఉన్న వెంకీ మామ చిత్రంలో నాగచైతన్యకు జోడీగా రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ను ఎంపిక చేయడం జరిగింది.అయితే వెంకటేష్‌ కోసం పలువురి పేర్లు ప్రస్థావనకు వచ్చాయి.

నిన్న మొన్నటి వరకు శ్రియ పేరు ప్రముఖంగా వినిపించింది.కాని ఇప్పుడు ఆ పేరు స్థానంలో పాయల్‌ రాజ్‌ పూత్‌ అంటున్నారు.

మరి ఇందులో అయినా నిజం ఉందా లేదా చూడాలి.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube