యుద్ధంలో వీరమరణం పొంది కూడా ఆ ఊరిలో వెలుగులు నింపాడు ఆ జవాను.! ఏమైందో తెలుస్తే కన్నీళ్లొస్తాయి.!

పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిలో అసువులు బాసిన వీర జవాను పంకజ్‌ కుమార్‌ త్రిపాఠి తాను అస్తమించి కూడా తన ఊరికి వెలుగులు తెప్పించాడు.ఉత్తర్‌ప్రదేశ్‌-నేపాల్‌ సరిహద్దులోని మారుమూల ప్రాంతమైన మహరాజ్‌గంజ్‌లో ప్రభుత్వ సహకారం అంతంతమాత్రంగానే ఉండేది.

 After Pulwama Soldiers Death His Village In Up Finally Sees Vikas-TeluguStop.com

పంకజ్ కుమార్ స్వస్థలంలో ప్రాథమిక పాఠశాల కూడా ఎన్నో ఏళ్లుగా శిథిలావస్థలో ఉంది.గ్రామస్థులు మొర పెట్టుకున్నా అధికారులు పట్టించుకోలేదు.పంకజ్‌ కుమార్‌ త్రిపాఠి వీరమరణంతో యూపీ సీఎం ఆదిత్యనాథ్‌తోపాటూ ఉన్నతాధికారులు ఆ ఊరికి రావడంతో, ఒక్కసారిగా ఆ ఊరిపై అధికారుల దృష్టిపడింది.పాఠశాల పునర్నిర్మాణపనులు చకచకా ప్రారంభమయ్యాయి.

పాఠశాల పేరును కూడా పంకజ్‌ త్రిపాఠి పేరుగా మార్చారు.అంతేకాదు ఊరిలో రోడ్ల మరమత్తులు కూడా మొదలుపెట్టారు.

ఆదిత్యనాథ్‌ ఆదివారం పంకజ్‌కుమార్‌ కుటుంబసభ్యులను పరామర్శించారు.పంకజ్‌చిత్రపటానికి నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా ఆ ఊర్లో పరిస్థితులను గమనించిన ఆదిత్యనాథ్‌ వారికి ప్రభుత్వం తరపున మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామని హామీఇచ్చారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube