వైసీపీకి జూనియర్ ఎన్టీఆర్ మద్దతు ఇస్తాడా ...?

ఏపీ రాజకీయాల్లో ప్రస్తుతం రాజకీయ వలసలు ఊపందుకున్నాయి.ఈ పార్టీ నుంచి ఆ పార్టీ లోకి ఆ పార్టీ నుంచి ఈ పార్టీలోకి వలస పోయే నాయకులతో ప్రతిరోజు సందడి వాతావరణం నెలకొంటోంది.

 Narne Srinivasa Rao Will May Join Ysrcp-TeluguStop.com

ముఖ్యంగా అధికార పార్టీ టిడిపి నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి ఒక్కో నేత మెల్లగా జారుకుంటున్నారు.ఇప్పటికే ఇద్దరు ఎంపీలు అవంతి శ్రీనివాస్, రవీంద్ర బాబు, అలాగే ఎమ్మెల్యే లు ఆమంచి కృష్ణమోహన్, మేడ మల్లికార్జున్ రెడ్డి కిందిస్థాయి నాయకులు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు.

ఇంకా అనేకమంది క్యూ లో ఉన్నారు.ఈ పరిణామం టిడిపిని ఆందోళనకు గురిచేస్తోంది.

ఈ తరుణంలోనే వైసీపీకి జూనియర్ ఎన్టీఆర్ మద్దతు ఇవ్వబోతున్నాడని.ఈ ఎన్నికల్లో ఆ పార్టీ తరఫున ప్రచారం చేయబోతున్నాడని ఊహాగానాలు మొదలయ్యాయి.

అసలు ఈ టాపిక్ రావడానికి ప్రధాన కారణం జూనియర్ ఎన్టీఆర్ మామ నార్నె శ్రీనివాసరావు.ఆయన నిన్న వైసీపీ అధినేత జగన్ కలవడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.

అయితే ఈ భేటీ పై ఇటువంటి ప్రాముఖ్యత లేదని కేవలం మర్యాదపూర్వకంగానే జగన్ ను కలిశానని… జగన్ తో తనకు అనేక సన్నిహిత సంబంధాలు ఉన్నాయని అదే రోజు క్లారిటీ ఇచ్చాడు.అయితే ప్రస్తుతం వైసీపీలోకి వలసలు జోరందుకుంటున్న సమయంలో నాని జగన్ ను కలవడం పై కొత్త రకమైన చర్చ మొదలైంది.

గత ఎన్నికల్లోనే ఆయన వైసీపీ తరఫున గుంటూరు జిల్లాలో ఏదో ఒక స్థానం నుంచి పోటీ చేయాలని చూశారు అయితే అప్పట్లో అధికారులు కానీ ఇప్పుడు అవకాశం దక్కుతుందేమో అన్న ఆలోచనతో జగన్తో భేటీ అయినట్లు ప్రచారం జరుగుతోంది.

నార్నె శ్రీనివాసులు చంద్రబాబు నాయుడు బాగా దగ్గర బంధువు.చంద్రబాబు అక్క కూతురు శ్రీనివాస రావు భార్య.జూనియర్ ఎన్టీఆర్కి వీరి కుమార్తె ప్రణతిని ఇచ్చి వివాహం చేశారు.

మొత్తం ఈ పెళ్లి తతంగానికి కారణం చంద్రబాబు.ఇది ఇలా ఉంటే… జూనియర్ ఎన్టీఆర్ 2009 ఎన్నికల సమయంలో టిడిపి తరఫున ప్రచారం చేశారు.

తన తాత స్థాపించిన తెలుగుదేశం పార్టీకి తన మద్దతు ఉంటుందని ప్రకటించారు.తర్వాత నుంచి టీడీపీ కార్యకలపాలకు దూరంగా ఉంటూ వస్తున్నాడు.

దీనికి కారణం చంద్రబాబు జూనియర్ కు ప్రాధాన్యత ఇవ్వకపోవడం.మొన్న తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో కూకట్ పల్లి నుంచి టిడిపి అభ్యర్థిగా రంగంలోకి దిగిన నందమూరి సుహాసిని తరపున జూనియర్ ఎన్టీఆర్ ప్రచారం చేస్తారని ప్రచారం జరిగినా …ఆయన మాత్రం స్పందించలేదు.

దీనికి కారణం జూనియర్ జూనియర్ చంద్రబాబు మధ్య బాగా గ్యాప్ పెరగడమే.

అయితే ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ మామ నార్నే శ్రీనివాసరావు ఈసారి ఏపీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు బాగా ఆసక్తి గా ఉండడంతో… వైసీపీ తరఫున జూనియర్ ఎన్టీఆర్ ప్రచారానికి దించాలని జగన్ ప్రతిపాదన పెట్టినట్టు తెలుస్తోంది.ఇక ఈ ప్రతిపాదనపై జూనియర్ ఎన్టీఆర్ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్ కు అత్యంత సన్నిహితుడైన కొడాలి నాని గుడివాడ నుంచి వైసీపీ ఎమ్మెల్యే గా ఉన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube