రాజమౌళి, శంకర్ సినిమాల్లో నటించడంపై బాలీవుడ్ స్టార్ హీరో క్లారిటీ

తమిళంలో శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా రూపొందుతున్న భారతీయుడు 2 మూవీలో బాలీవుడ్ స్టార్ అజయ్ దేవ్ గన్ నటించబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి.అయితే అవి కేవలం పుకార్లు మాత్రమే అని తేలిపోయింది.

 Ajay Devgan Clarifies About His Movie With Shankar And Rajamouli-TeluguStop.com

మంచి సినిమా, తప్పకుండా అజయ్ దేవగన్ నటిస్తే బాగుంటుందని శంకర్ భావించాడట.నిజంగానే శంకర్ ఒక పాత్ర కోసం అజయ్ దేవగన్ ను సంప్రదించాడట.

ఈ విషయాన్ని స్వయంగా అజయ్ దేవగన్ ప్రకటించాడు.

ప్రస్తుతం తాను హిందీ సినిమాతో బిజీ గా ఉండటం వల్ల శంకర్ గారు ఆడిగినట్లుగా భారతీయుడు 2 సినిమాలో నటించలేక పోయాను.శంకర్ గారితో మళ్ళీ ఎప్పుడైనా అవకాశం వస్తే తప్పకుండా నటిస్తాను అంటూ చెప్పుకొచ్చాడు.మరో వైపు రాజామౌళి సినిమాలో నటించబోతున్నట్లుగా వస్తున్నట్లుగా వచ్చిన వార్తలను కొట్టి పడేశాడు.

భారతీయుడు 2 సినిమాకు నన్ను సంప్రదించిన విషయం నిజమే కానీ, రాజమౌళి సినిమాకు మాత్రం నన్ను సంప్రదించలేదు అంటూ అజయ్ దేవగన్ చెప్పుకొచ్చాడు.రాజమౌళి సినిమాలో చిన్న పాత్రను చేస్తున్నట్లుగా వస్తున్న వార్తలను క్లారిటీగా కొట్టి పారేశారు.ఆర్ ఆర్ ఆర్ మల్టి స్టారర్ మూవీలో విలన్ పాత్ర ఎవరు చేయబోతున్నారని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.మరి జక్కన్న మనసులో ఎవరు ఉన్నారో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube