వైసీపీ బీసీ గర్జనకు ఏలూరు లో భారీ ఏర్పాట్లు! జగన్ వాగ్దానాలపై ఆసక్తి!

ఏపీ రాజకీయాల్లో ఎన్నికల సంఘం మొదలైంది.ఇప్పటికే అధికార ప్రతిపక్ష పార్టీలు ప్రజల్లో తమ ఎన్నికల కార్యాచరణ అమలు చేయడం మొదలు పెట్టాయి.

 Y S Jagan Came To Gannavaram For Participating Bc Garjana-TeluguStop.com

మరోవైపు జనసేన పార్టీ కూడా సైలెంట్ గా ప్రజల్లోకి దూసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది.ఇక ఏపీ రాజకీయాల్లో ప్రధాన పార్టీలు మూడు కూడా బీసీలపై ఎక్కువగా దృష్టి పెట్టినట్లు కనిపిస్తోంది.

బీసీ కులాల ఓటు బ్యాంకు సొంతం చేసుకోవడమే లక్ష్యంగా అధికార ప్రతిపక్ష పార్టీలు తమ వాగ్దానాలు ప్రకటిస్తున్నాయి.ఇప్పటికే ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బీసీ గర్జనలో పిసిలో ఉన్న కులాలకు కూడా కార్పొరేషన్ ఏర్పాటు చేసి వారికి చైర్మన్లను నియమించి బీసీ కులాల ప్రజలను ఆకర్షించే ప్రయత్నం చేశారు.

ఇదిలా ఉంటే తాజాగా వైఎస్సార్సీపీ అధినేత జగన్ నేడు ఏలూరులో బీసీ గర్జన పేరుతో భారీ బహిరంగ సభ ఏర్పాట్లు చేసుకున్నారు.ఈ బహిరంగ సభ కోసం జన సమీకరణ, అలాగే ఏర్పాట్లను వైఎస్సార్సీపీ పార్టీ నేతలు చూసుకుంటున్నారు.

ఈరోజు సాయంత్రం జరగనున్న ఈ బీసీ గర్జనలో పాల్గొనడానికి ఇప్పటికే జగన్ గన్నవరం చేరుకోవడం జరిగింది.ఇక పార్టీ నేతలతో చర్చించి ఆపై బహిరంగ సభలో నేరుగా పాల్గొనడానికి జగన్ వెళ్లే అవకాశం ఉంది.

బహిరంగ సభలో వైఎస్సార్సీపీ పార్టీ తరఫున బీసీలకు తమ పార్టీ చేసే సంక్షేమ పథకాలను జగన్ ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది.బీసీల ఓటు బ్యాంకు పై ప్రత్యేక దృష్టి పెట్టిన జగన్ ఇప్పటికే కులాల్లో రాజకీయ ప్రాతినిధ్యం వహిస్తున్న నాయకులు తమవైపు ఆకర్షించే ప్రయత్నం మొదలు పెట్టారు.

అందులో భాగంగానే ఆమంచి కృష్ణమోహన్, జై రమేష్, అవంతి శ్రీనివాస్ లాంటి కీలక నేతలు వైఎస్సార్సీపీ లో చేరిపోయారు.ఇక ఈ బీసీ గర్జన తర్వాత వైయస్సార్సీపి వైపు వచ్చే నేతలు ఎక్కువ మంది ఉంటారని ఆ పార్టీ నేతలు చెప్తున్నారు.

మరి బీసీ గర్జనలో జగన్ బీసీ కులం ఆకర్షించే విధంగా ఎలాంటి వాకిలి చేస్తారు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube