నోబెల్ కి ట్రంప్ నామినేషన్..ఎందుకు ఇవ్వాలో రీజన్ చెప్పిన ట్రంప్..!!!

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నోబెల్ శాంతి పురస్కారానికి నామినేషన్ వేసినట్టుగా ఆయనే స్వయంగా తెలిపారు.ఉత్తర కొరియాతో శాంతి చర్చలు జరిపినందుకు గాను జపాన్ ప్రధాని షింజో అబే తనను ఈ పురస్కారానికి నామినేట్ చేసినట్టుగా తెలిపారు.

 Donald Trump Applies To Nobel Award-TeluguStop.com

అయితే ఈ విషయాన్ని ధృవీకరిస్తూ షింజో అబే తనకు రాసిన ఐదు పేజీల లేఖ తనకి అందిందని, జపాన్ ప్రజల తరఫున ఆయన ఈ పురస్కారానికి తనని నామినేట్ చేశారని ట్రంప్ అన్నారు.

తనకు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాల్సిందిగా నోబెల్ కమిటీని కోరుతున్నట్టుగా ఆ లేఖలో ఉందని, అయితే ఈ విషయంపై షింజో అబేకి కృతజ్ఞతలు తెలిపినట్టుగా శ్వేత సౌధం లో విలేఖరుల ముందు ట్రంప్ ప్రకటించారు.ఎన్నటికీ ఈ పురస్కారం నాకు లభించకపోవచ్చునని అయితే

గతంలో ఒబామాకి ఈ పురస్కారం ఇచ్చారని అయితే అది ఎందుకు ఇచ్చారో ఇప్పటికీ నాకు అర్థం కాలేదని ట్రంప్ కామెంట్స్ చేశారు…ప్రపంచ శాంతి కోసం ఎనలేని కృషి చేశానని, వేలాది మంది ప్రాణాలని కాపాడానని, సిరియాలో 30 లక్షల మంది ప్రజలని ఊచకోత నుంచీ కాపాడానని ట్రంప్ మీడియా ముందు తెలిపారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube