అమెరికాలో మరిన్ని... 'ఫేక్ యూనివర్సిటీలు'

అమెరికా వ్యాప్తంగా సంచలనం సృష్టించి భారతీయవిద్యార్ధులని ఆందోళన కలిగించి జైలు పాలు చేసిన నకిలీ విద్యార్ధి వీసాల వ్యవహారం అందరికి తెలిసిందే అయితే.ఫర్మంగ్టన్ లాంటి యూనివర్సిటీలు అమెరికాలో మరిన్ని ఉన్నాయని, అక్కడ చదువుతున్న విద్యార్ధులకి కూడా ఈ భాద తప్పేలా లేదని త్వరలో వారి అరస్టులు కూడా జరుగుతాయ అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.

 More Fake Universities In America-TeluguStop.com

ఈ అనుమానాలని వ్యక్తం చేసింది ఎవరో కాదు.కాలిఫోర్నియాలోని ఆంధ్రప్రదేశ్ APNRT సొసైటీ మీడియా కో-ఆర్డినేటర్ సాగర్ అభిప్రాయ పడ్డారు.మరిన్ని యూనివర్సిటీలలో చదువుతున్న భారత విద్యార్ధులు ఈ యూనివర్శిటీ కూడా ఫేక్ అని తెలిస్తే తమ భవిష్యత్తు ఏమి కాను అనే భయాందోళనలో ఉన్నట్లుగా తెలుస్తోంది.

ఇదిలాఉంటే భారతీయ విద్యార్ధులు ఎవరైనా సరే ఫేక్ యూనివర్సిటీలలో చదువుతుంటే వారిని ఆరేస్ చేయకముందే యూనివర్శిటీ నుంచీ ఎలా బయటపడేయాలో న్యాయవాదుల ద్వారా అవగాహనా కార్యక్రమాలు చేపడుతున్నారు తెలుగు అసోసియేషన్ ఆటా.

ఫ్లొరిడాలోని ఓ యూనివర్శిటీని గూగుల్ మ్యాప్స్‌లో సెర్చ్ చేయగా.అది ఇండస్ట్రియల్ కాంప్లెక్స్‌లో వెయ్యి చదరపు అడుగులుగా ఉన్నట్టు, పార్కింగ్ స్థలం కూడా తక్కువ ఉన్నట్టు చూపించిందని, ఆ యూనివర్సిటీ పై మాకు సందేహాలు ఉన్నాయని భీంరెడ్డి తెలిపారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube