పీకే భయపెట్టేస్తున్నాడే ! ఇంచార్జీల్లో దడ మొదలయ్యిందా ...?

ఎన్నికలు దగ్గర పడే కొద్దీ… వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ స్పీడ్ పెంచుతోంది.అధికార పార్టీ టీడీపీ ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ… రాజకీయంగా ముందంజలో ఉండేందుకు నిత్యం ప్రయత్నిస్తూనే ఉంది.

 Ycp Leaders Gets Tension Over Prashant Kishor-TeluguStop.com

ఏపీలో పాలిటిక్స్ హీటెక్కిన సమయంలో వైసీపీ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఏపీ రాజకీయాలపై ఇప్పుడు పూర్తిగా దృష్టి పెట్టాడు.ఇప్పటి వరకు బీహార్ రాజకీయాల్లో బిజీ బిజీగా ఉన్న పీకే గతంలో జగన్ కు ఇచ్చిన హామీ మేరకు ప్రత్యక్షంగా రంగంలోకి దిగి వైసీపీ రాజకీయ కార్యకలాపాలు పరిశీలిస్తున్నాడు.

ఇప్పటికే ప్రతి నియోజకవర్గంలోనూ పార్టీ పరిస్థితిపై అనేకసార్లు సర్వేలు పూర్తి చేయించిన పీకే ఆ మేరకు ఆయా నియోజకవర్గంలో ఏ అభ్యర్థికి గెలుపు అవకాశాలు ఉన్నాయి అనే విషయంపై పూర్తిగా క్లారిటీ తో ఉన్నాడు.

ఇప్పటికే దానికి సంబంధించిన రిపోర్ట్స్ ను ఇప్పటికే పలు ధపాలుగా… జగన్ కు తయారుచేసి అందించారు.సుమారు 130 నియోజకవర్గాల్లో అభ్యర్థులను ఎంపిక చేసినట్టు కూడా తెలుస్తోంది.అయితే ప్రస్తుతం ప్రశాంత్ కిషోర్ నియోజకవర్గ ఇంచార్జీలను.

టికెట్లు ఆశిస్తున్న ప్రధాన ఆశావాహులను ఒక్కొక్కరిని పిలిపించుకుని వివరాలు రాబడుతూ… నియోజకవర్గంలో వాస్తవ పరిస్థితి గురించి వారితో చర్చిస్తున్నాడు.ప్రస్తుతం ఉన్న నియోజకవర్గ ఇంచార్జిల గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు… ఆయా నియోజకవర్గాల్లో వైసీపీ పరిస్థితి ఏంటి…? ఏ నాయకుడు ఏం చేస్తున్నాడు .? తదితర అంశాలతో వారితో చర్చించి వాస్తవ పరిస్థితులను వివరిస్తుండడంతో నియోజకవర్గ ఇంచార్జీలు ఆందోళన చెందుతున్నారు.

ఇప్పటి వరకు టికెట్ తమదే అనుకుని నియోజకవర్గం అంతా కలియతిరుగుతూ… భారీగా ఖర్చు చేశామని…కానీ పీకే చెబుతున్న లెక్కల ప్రకారం తమకు అసలు టికెట్ వస్తున్న నమ్మకమే లేదని మరికొందరియు వాపోతున్నారు.ఆయ నియోజకవర్గాల్లో ఉన్న ప్రధాన ఓటు బ్యాంకు గా ఉన్న సామాజిక వర్గాలకు ఎలా దగ్గరవ్వాలో వైసీపీ ఇన్ ఛార్జులకు ఇప్పటికే సూచనలు అందిస్తున్నాడు పీకే.అంతేకాకుండా ఆ నియోజకవర్గంలో ఇతర పార్టీల్లో ఉన్న బలమైన నేతలను వైసీపీలోకి రప్పించడంపైనా ఆయన చర్చలు జరుపుతున్నారు.

రెండు నెలల పాటు ప్రజల్లో ఉండేలా ప్రణాళికలను రూపొందించుకోవాలని ప్రశాంత్ కిషోర్ సూచిస్తున్నారు.మొత్తంగా చూస్తే పీకే ఎటువంటి మొహమాటం లేకుండా ఆయా నియోజకవర్గ ఇంచార్జిలతో మాట్లాడుతూ… వాస్తవ విషయం చెప్పేస్తుండడంతో జగన్ ఈ విషయంలో కొంత తలనొప్పి తగ్గినట్టే అయ్యింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube