'118'ను ఎన్టీఆర్‌తో తీయాలనుకున్నాడట.. ఇది మరీ ఓవర్‌ కళ్యాణ్‌

కళ్యాణ్‌ రామ్‌ తాజాగా ‘118’ చిత్రంలో నటించాడు.ఇటీవలే ఈ చిత్రం ట్రైలర్‌ను విడుదల చేశారు.

 Kalyan Ram Supposed To Do 118 Movie With Jr Ntr-TeluguStop.com

ట్రైలర్‌ థ్రిల్లర్‌ ఎలిమెంట్స్‌తో ఆకట్టుకుంది.సినిమా బాగుండేలా ఉందే అంటూ సినీ వర్గాల వారు మరియు ప్రేక్షకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

కనిపించని ఒక అమ్మాయి కోసం హీరో పడే తపన నేపథ్యంలో ఈ చిత్రం ఉంటుందని ట్రైలర్‌ చూస్తుంటే అనిపిస్తుంది.ట్రైలర్‌తో సినిమాపై అంచనాలు పెంచారు.

కళ్యాణ్‌ రామ్‌ లుక్‌ మరియు నటన కూడా చాలా బాగుంది.త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రం గురించి ఎన్టీఆర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

‘118’ చిత్రం కథ తన వద్దకు వచ్చిన సమయంలో చాలా నచ్చింది.ఈ కథకు తమ్ముడు ఎన్టీఆర్‌ అయితే చాలా బాగా సూట్‌ అవుతాడని భావించాను.తప్పకుండా ఎన్టీఆర్‌తో ఈ కథను చేయాలని ఆశించాను.అయితే అప్పటికే ఈ కథను మహేష్‌ కోనేరు తీసుకున్నారు.ఆయన నాతోనే సినిమా చేయాలని కోరుకుంటున్నట్లుగా చెప్పారు.దాంతో నేను కాదనలేక పోయాను.

కథ నాకు కూడా బాగా నచ్చింది, మహేష్‌ గారు నాతోనే సినిమాను నిర్మించాలని కోరుకున్న నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కిందని కళ్యాణ్‌ రామ్‌ అన్నాడు.

ఇలాంటి థ్రిల్లర్‌ ఎలిమెంట్స్‌ మూవీని ఎన్టీఆర్‌ ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునే వాడు కాదు, ఎందుకంటే ఎన్టీఆర్‌కు ఇలాంటి కథలు అస్సలు సూట్‌ అవ్వవు.మరో వైపు రాజమౌళి సినిమాలో నటిస్తున్న కారణంగా వచ్చే ఏడాది వరకు కూడా మరో సినిమాకు కమిట్‌ అయ్యే అవకాశం లేదు.ఎన్టీఆర్‌ సినిమా అంటే ప్రేక్షకులు మాస్‌ మసాలా ఉండాలనుకుంటారు.కాని థ్రిల్లర్‌ సినిమాలో ఎన్టీఆర్‌ నటిస్తే ఆధరించడం కష్టమే.118 చిత్రాన్ని ఎన్టీఆర్‌ చేయక పోవడమే మంచిది అయ్యింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube