వర్మ ఎఫెక్ట్‌.. పబ్లిసిటీ లేకుండా రాబోతున్న మహానాయకుడు

ఎన్టీఆర్‌ కథానాయకుడు విడుదలకు ముందు సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.క్రిష్‌ దర్శకత్వంలో మూవీ అనగానే అంతా కూడా మంచి అభిప్రాయంతో సినిమా కోసం ఎదురు చూశారు.

 Ntr Mahanayakudu Getting Released Without Publicity-TeluguStop.com

కథానాయకుడు వచ్చిన తర్వాత సినిమాకు పాజిటివ్‌ టాక్‌ వచ్చింది.అయితే కలెక్షన్స్‌ మాత్రం రాలేదు.

ఆశించిన స్థాయిలో కలెక్షన్స్‌ రాకపోవడంతో చిత్ర యూనిట్‌ సభ్యులు షాక్‌ అయ్యారు.ఈ సమయంలోనే మహానాయకుడు చిత్రాన్ని విడుదల చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

మహానాయకుడు చిత్రానికి పెద్ద కష్టం వచ్చింది.

లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ చిత్రంతో వర్మ చేస్తున్న సందడి కారణంగా ఎన్టీఆర్‌ మహానాయకుడు చిత్రాన్ని పట్టించుకునే దిక్కు లేకుండా పోయింది.అసలు మహానాయకుడు విడుదల అవుతుందా అనే అనుమానాల మద్య ఎట్టకేలకు విడుదలకు సిద్దం చేశారు.సినిమా విడుదలకు పట్టు మని పది రోజులు కూడ లేదు.

అయినా ఇప్పటి వరకు సినిమాకు సంబంధించిన పబ్లిసిటీ కార్యక్రమాలు పెద్దగా చేయడం లేదు.సినిమాను కూడా పెద్ద ఎత్తున విడుదల చేయాలని భావించడం లేదు.

ఇక ఈ చిత్రాన్ని డిస్ట్రిబ్యూటర్లకు ఇచ్చి వారిని నష్టపర్చడం ఇష్టంలేని బాలకృష్ణ స్వయంగా తానే సురేష్‌ ఫిల్మ్‌తో కలిసి విడుదల చేస్తున్న విషయం తెల్సిందే.

వర్మ దర్శకత్వంలో రూపొందుతున్న లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ పైనే అందరి దృష్టి ఉంది.త్వరలోనే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు వర్మ ఏర్పాట్లు చేస్తున్న నేపథ్యంలో లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ మూవీ పై ఉన్నంత శ్రద్దను మహానాయకుడుపై పెట్టలేక పోతున్నారు.మహానాయకుడు చిత్రంలో ఉన్నది ఉన్నట్లుగా చూపించరని, దాంతో పాటు మొత్తం పాజిటివ్‌గానే చూపిస్తారని అంటున్నారు.

ఇక మహానాయకుడు చిత్రంలో ఎన్టీఆర్‌ కీలకమైన చివరి రోజుల్లో ఎలా జీవించాడు అనే విషయాన్ని చూపించడం లేదట.దాంతో మహానాయకుడిపై ఆసక్తి లేదు.ఆసక్తి లేని సినిమాలకు పబ్లిసిటీ చేసి ఏం లాభం అనుకున్నారో ఏమో కాని పెద్దగా పబ్లిసిటీ నిర్వహించడం లేదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube