రైతులకు ఉచితంగా 9 గంటల విద్యుత్! ఏపి క్యాబినెట్ ఆమోదం!

ఎన్నికల ముందు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజలకు వరుసగా సంక్షేమ పథకాలు, వరాల జల్లు కురిపిస్తున్నాడు.వాటిని ఉన్నపళంగా అమలు చేస్తూ ప్రజలకు అందించే ప్రయత్నం చేస్తున్నాడు.

 Ap Cm Chandrababu Naidu 9 Hours Free Power To Farmers-TeluguStop.com

ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంక్షేమ కార్యక్రమంలో భాగంగా రైతులకు 10 వేల ఆర్థిక సాయం ప్రకటించారు.అలాగే డ్వాక్రా మహిళలకు పదివేల రూపాయలు చెక్కులు కూడా ఇవ్వడం జరిగింది.

వాడితో పాటు పెన్షన్లు రెండు వేల వరకు పెంచి వృద్ధులకు ఆర్థికంగా స్వాలంబన అందించాడు.మరో నెల రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ నేపథ్యంలో సంక్షేమ కార్యక్రమాలు తనకు కలిసివస్తాయని చంద్రబాబు భావిస్తున్నారు.

ఇదిలా ఉంటే తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు తన క్యాబినెట్ కలిసి మరో కీలక నిర్ణయం కి తీసుకున్నారు.రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని వారికి 9 గంటల ఉచిత విద్యుత్తు ఇవ్వడానికి ముందుకు వచ్చారు.

దీనికి క్యాబినెట్ కూడా వెంటనే ఆమోదం తెలపడంతో ఈ తొమ్మిది గంటల విద్యుత్ తక్షణం అమల్లోకి తీసుకొచ్చారు.మరోవైపు ఈ రోజు కూడా చంద్రబాబు నాయుడు క్యాబినెట్ భేటీ నిర్వహిస్తున్నారు.

ఈ భేటీలో ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని విషయంపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube