జగన్ పిలుపుకి అర్ధం మార్చేశారా...? ఆయన అసహనానికి కారణం అదేనా ...?

వైసీపీలో ప్రస్తుతం టీడీపీ ఎమ్యెల్యే, ఎంపీలు, నాయకులు పెద్ద ఎత్తున చేరుతుండడం ఆ పార్టీలో జోష్ నింపుతున్నా… అధినేత జగన్ లో మాత్రం ఏదో తెలియని బాధ … అసంతృప్తి స్పష్టంగా కనిపిస్తున్నాయి.వచ్చే ఎన్నికల్లో గెలుపు జెండా ఎగురవేయాలంటే… తప్పనిసరిగా అన్ని వర్గాల మద్దతు పొందాలని … ముఖ్యంగా ఏ పార్టీకి సపోర్ట్ చేయకుండా తటస్థంగా ఉన్న వ్యక్తులను ఆకర్షించి వైసీపీ విజయానికి బాటలు వేసుకోవాలని జగన్ ఆలోచన చేస్తున్నారు.

 Ys Jagan Upset With Anna Pilupu Program-TeluguStop.com

దీనిలో భాగంగానే… కీలకమైన కొంతమంది వ్యక్తులను గుర్తించి… వారికి ఉత్తరాలు రాసి వారితో సమావేశాలు నిర్వహించాలని జగన్ కొంతకాలంగా ప్రయత్నిస్తున్నాడు.అయితే పార్టీ నాయకుల నుంచి మాత్రం పెద్దగా స్పందన మాత్రం కనిపించడంలేదు.

అన్న పిలుపు పేరుతో సుమారు 70 వేల మందికి వైసీపీ అధినేత జగన్ పేరుతో లేఖలు వెళ్లాయి.అయితే… వీరందరితో దశలవారీగా… సభలు… సమావేశాలు నిర్వహించి వారి వారి సూచనలు తీసుకోవాలన్నది జగన్ ప్లాన్.ఇక ఇప్పటికే సమర శంఖారావం పేరుతో సభలను కూడా జగన్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.ఈ సభకు కొన్ని గంటల ముందు తటస్థులతో జగన్ భేటీ అవుతున్నారు.

తిరుపతి, అనంతపురం, కడప శంఖారావ సభల్లో కూడా ఈ విధంగానే ….తటస్థులతో సమావేశమయ్యారు.

అయితే ఇక్కడ జగన్ కు అసహనం కలిగిస్తున్న సంగతి ఏంటి అంటే … ఆ సమావేశాల్లో తటస్థులకంటే… వైసీపీ నాయకులే ఎక్కువ సంఖ్యలో హాజరవుతున్నారట.

అనంతపురంలో జరిగిన అన్న పిలుపునకు మొత్తం 300 మంది హాజరయ్యారు.వీరిలో దాదాపు 180 మంది వైసీపీ కార్యకర్తలే ఉన్నట్టు జగన్ దృష్టికి రావడంతో అసహనం వ్యక్తం చేశారట.ఇక తాడిపత్రి, అనంతపురం లో కూడా… అభిమానులతో సభను నింపే ప్రయత్నం చేశారని జగన్ తెలిసిందట.

దీంతో జగన్ నాయకుల మీద ఆగ్రహం వ్యక్తం చేసినట్టు గుసగుసలు వినిపూయిస్తున్నాయి.అదే విధంగా… హైదరాబాద్ లో జగన్ నిర్వహించిన కార్యక్రమంలోనూ వైసీపీ అభిమనులే ఎక్కువగా ఉన్నట్టు పార్టీ నేతలే చెవులు కొరుక్కుంటున్నారు.

పార్టీ విజయం కోసం తాను తటస్థులను ఆకర్షించాలని చూస్తుంటే… సొంత పార్టీ నాయకులే ఇలా నీరు గార్చేస్తే ఎలా అంటూ… జగన్ ఆవేదన చెందుతున్నాడట.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube