పెళ్లిలో ఆ డాన్స్‌లు, ఫొటోలు ఏంటీ... కుటుంబంకు మత బహిష్కరణ

ఈమద్య కాలంలో పెళ్లిలు ఏ స్థాయిలో జరుగుతున్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.ఎంత మద్య తరగతి వారు అయినా పెళ్లిలు కనీసం రెండు మూడు రోజులు చేస్తున్నారు.

 Cast People Avoids A Family For The Reason Of Getting Photos And Dance-TeluguStop.com

మొదటి రోజు సంగీత్‌ అంటూ ఆటా పాటలతో అదరగొట్టడం, ఆ తర్వాత పెళ్లి, ఇక పెళ్లి తర్వాత రిసెప్షన్‌.ఇలా వరుసగా పెళ్లి అంటే హడావుడి ఉంటూనే ఉంటుంది.

ఇక పెళ్లిలో ప్రతి మూమెంట్‌ను బంధించేందుకు లక్షలు ఖర్చు పెట్టి ఫొటోగ్రాఫర్స్‌ను పెడుతున్నారు.అయితే ఇవే కేరళలోని ఒక కుటుంబం బహిష్కరణకు కారణం అయ్యాయి.

పెళ్లిలో డాన్స్‌లు, ఫొటోలు అంటూ హడావుడి చేశారు అంటూ కుటుంబంను మతపెద్దలు వెలి వేశారు.కంప్యూటర్‌ కాలంలో కూడా ఇలాంటి సంఘటనలు జరగడం దారుణం.ఈ సంఘటన జరిగి రెండు నెలలు దాటింది.అయితే ఇప్పుడు మీడియా ముందుకు వచ్చింది.కుటుంబ బహిష్కరణపై ఆ కుటుంబ సభ్యులు ఇప్పుడు మీడియా ముందుకు వచ్చారు.

పూర్తి వివరాల్లోకి వెళ్తే…


కేరళ రాష్ట్రం పాలక్కడ్‌ జిల్లా థ్రితలలో డిసెంబర్‌ 28న వివాహం జరిగింది.పెళ్లి జరిగిన కొన్ని రోజుల తర్వాత మత పెద్దలు నాలుగు కారణాలు చూపుతూ కుటుంబంను బహిష్కరించారు.మహల్లు కమిటీ వారి నిర్ణయంతో ఆ కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు.

కమిటీ సభ్యులను బతిమిలాడేందుకు ప్రయత్నించారు.

ఇంతకు మహల్లు కమిటీ వారు చూపించిన ఆ నాలుగు కారణాలు ఏంటో తెలుసా…


1.ఫంక్షన్‌లో మహిళలు పాటలు పాడటం,
2.ఆడ, మగ కలిసి ఫొటోలకు ఫోజ్‌లు ఇవ్వడం.ముఖ్యంగా ఆడవారు బుర్కా లేకుండా ఫొటోలకు ఫోజ్‌లు ఇవ్వడం
3.స్టేజ్‌పై పిల్లలతో డాన్స్‌లు చేయించడం,
4.పెళ్లిలో పాటలు పెట్టడం, మైక్రోఫోన్‌ను వాడటం.

ఈ నాలుగు సిల్లీ కారణాలు, అయినా కూడా కుటుంబంను వెలివేశారు.కేరళలో ముస్లీం మతాచారాలు కఠినంగా ఉంటాయి.అనేందుకు ఇది ఒక నిదర్శణం.

ఇలాంటి పద్దతులు ఇండియాలో ఉండటం దారుణం అంటూ సోషల్‌ మీడియా కోడై కూస్తోంది.కుటుంబంను వెలి వేసిన కమిటీ వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్‌ వ్యక్తం అవుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube