అన్నయ్య, తమ్ముడు మందు అలవాటుపై... నాగబాబు ఆసక్తికర కామెంట్స్‌

మెగా బ్రదర్‌ నాగబాబు గత కొన్ని వారాలుగా సోషల్‌ మీడియాలో తెగ చక్కర్లు కొట్టేస్తున్నాడు.వరుసగా ఇంటర్వ్యూలు, తన యూట్యూబ్‌ ఛానల్‌ ద్వారా వీడియోలను వదలడం, హాట్‌ కామెంట్స్‌ ఇలాంటి వాటితో సోషల్‌ మీడియాలో ఎప్పుడు కనిపిస్తూ వస్తున్న నాగబాబు తాజాగా తన అన్న తమ్ముడు గురించి ఆసక్తికర విషయాలు చెప్పి అందరిని ఆశ్చర్య పర్చాడు.

 Nagababu Sensational Comments On Megastar And Power Star-TeluguStop.com

సినీ సెలబ్రెటీలు అన్నప్పుడు మందు అలవాటు ఖచ్చితంగా ఉంటుంది, అది చిరంజీవి, పవన్‌ కళ్యాణ్‌కు మినహాయింపు ఏమీ కాదని నాగబాబు చెప్పుకొచ్చాడు.

అన్నయ్య చిరంజీవి మందు తాగుతారు, అయితే చాలా అరుదగా మాత్రమే ఆయన తాగుతారు.ఏదైనా ముఖ్యమైన పార్టీకి వెళ్లినప్పుడు మాత్రమే ఆయన ఆల్కహాల్‌ను తీసుకుంటాడని నాగబాబు అన్నాడు.ఇక తమ్ముడు పవన్‌ కళ్యాణ్‌ కూడా ఆల్కహాల్‌ తీసుకుంటాడు కాని ఇంకా తక్కువ, వాడు ఆల్కహాల్‌ చాలా తక్కువ సందర్బాల్లో మాత్రమే తీసుకుంటాడని చెప్పుకొచ్చాడు.

ఇక నేను ఒకప్పుడు ఆల్కహాల్‌ తీసుకునేవాడిని, కాని ఇప్పుడు మాత్రం నాకు ఆ అలవాటు లేదు.ఆరోగ్య కారణాల రీత్యా నేను ఆల్కహాల్‌ను వదిలేశాను.స్మోకింగ్‌ను కూడా నేను వదిలేశాను అంటూ నాగబాబు చెప్పుకొచ్చాడు.

సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యేందుకు నాగబాబు ఈమద్య కాలంలో తెగ ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు.అందులో భాగంగానే ఈ విషయాన్ని కూడా చెప్పుకొచ్చాడు.సెలబ్రెటీలు పార్టీలకు వెళ్లినప్పుడు మందు తాగడం అనేది కామన్‌ విషయం, చిరంజీవి, పవన్‌ తీసుకుంటున్నారని నాగబాబు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

ఆయన కేవలం పబ్లిసిటీ కోసమే ఇలా ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నాడని కొందరు విమర్శలు చేస్తున్నారు.తన యూట్యూబ్‌ ఛానెల్‌లో పోస్ట్‌ చేసిన వీడియోలకు భారీగా వ్యూస్‌ వస్తున్న నేపథ్యంలో మరింత జోష్‌గా వీడియోలను వదిలేందుకు ప్రిపేర్‌ అవుతున్నాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube