ఈ అమ్మాయి సాహసాలు చూస్తే మగవారు సైతం భయంతో కళ్లు మూసుకుంటారు.. హ్యాట్సాప్‌ రెహానా

ఈమద్య కాలంలో అమ్మాయిలు టీవీలర్స్‌ నడపడం చాలా కామన్‌ అయ్యింది.అయితే ఎవరైనా బులెట్‌ లేదా మరేదైనా బైక్‌ పై వెళ్తుంటే మాత్రం వింతగా చూస్తాం.

 Gutsy Woman Rehana Khan Displays Her Biking Skills In Fairs1-TeluguStop.com

స్కూటీ వంటివి కాకుండా బైక్‌ లను నడిపే అమ్మాయిలను చూసి అబ్బ అనుకుంటాం.ఇక బైక్‌లపై సాహసాలను చేసే వారిని చూస్తే నోరు వెళ్ల బెడతాం.

కాని రెహానా ఖాన్‌ బైక్‌ తో చేసే సాహసాలను చూస్తే మాత్రం ఎంతటి ధైర్య వంతులు అయినా కూడా బాబోయ్‌ అంటూ ఒక సెకను కళ్లు మూసుకోవాల్సిందే.అంతటి సాహసాలను చేస్తున్న రెహానా ఖాన్‌ ఇండియాలోనే అత్యంత అరుదైన లేడీగా గుర్తింపు దక్కించుకుంది.

ఇటీవల నాంపల్లి ఎగ్జిబీషన్‌ గ్రౌండ్స్‌లో రెహానా ఖాన్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.వెల్‌ ఆఫ్‌ డెత్‌(మృత్యుబావి)లో బైక్‌ విన్యాసాలతో ఈమె అబ్బురపర్చింది.ఒక మహిళ ఇలాంటి విన్యాసాలు చేయడం ఇండియాలోనే ప్రథమం.సహజంగా ఇలాంటి విన్యాసాలు మృత్యువుతో పోరాటం వంటివి.

పురుషులు మాత్రమే ఇలాంటి ధైర్య సాహసాలను చేస్తారు.అయితే పురుషులకు తాను ఏమాత్రం తక్కువ కాదు అంటూ రెహానా ఖాన్‌ నిరూపించింది.

ఆమె అత్యంత అద్బుతమైన సాహసాలను చేయడంతో ఆమెకు అరుదైన మహిళ అనే గౌరవం దక్కింది.

పెళ్లి, పిల్లలు ఉన్నా కూడా రెహానా ఈ సాహసాలు చేస్తోంది.పెళ్లికి ముందు రహానా ఇలాంటి సాహసాలు చేసేందుకు కుటుంబ సభ్యులు ఒప్పుకోలేదు.అసలు బైక్‌ నేర్చుకునేందుకు కూడా ఆమెకు అనుమతించలేదు.

అయితే ఆమె భర్త మాత్రం పూర్తి సహకారం అందించాడు.రహానాలో ఉన్న అభిరుచిని తెలుసుకుని బైక్‌ నేర్చించాడు.

ఆ తర్వాత సాహసాలు చేసేందుకు కూడా భర్త ప్రోత్సాహం ఇచ్చాడు.నాలుగు నెలల గర్బిణిగా ఉన్న సమయంలో కూడా రహానా విన్యాసాలు చేసింది.

ప్రస్తుతం రహానా పాపకు 5 సంవత్సరాలు, ఆ పాప బాగోగులను ఒక తల్లిగా చూసుకుంటూ మరో వైపు ఈ సాహసాలను చేస్తూ ఉంది.ప్రతి రోజు 8 నుండి 10 సార్లు ఈ వెల్‌ ఆఫ్‌ డెత్‌ రైడ్‌ ను ఆమె చేస్తుంది.ప్రతి రైడ్‌కు 10 నిమిషాలు పడుతుంది.బైక్‌ రైడ్‌ మాత్రమే కాకుండా కొన్ని సార్లు కారు రైడ్‌ కూడా ఆమె చేస్తుంది.ట్రాక్‌పై ఉన్న సమయంలో బైక్‌ వదిలి మరీ పరుగెత్తడం చేస్తూ ఉంటారు.మహిళలు ధైర్యంగా ఉంటే మగాళ్లతో పాటు ఏ సాహసం అయినా చేస్తారు అంటూ రహానా చెప్పుకొచ్చింది.

రహానా ప్రతి అమ్మాయికి ఆదర్శంగా నిలుస్తుంది.అమ్మాయిలు ధైర్యంతో జీవితంలో ముందుకు వెళ్లాలని రహానా తన సాహసాలతో సందేశాన్ని ఇస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube