కుక్కల కోసం 25 ఏళ్ల బంధాన్ని కూడా వదులుకుంది... ఈమె గొప్పది అనాలో, పిచ్చిది అనాలో మీరే చెప్పాలి

జంతువులను ప్రేమించడం అనేది చాలా మంచి అలవాటు, మూగ జీవాలను ప్రేమిస్తూ వాటికి స్థానం ఇచ్చి వాటి సంరక్షణ చేసిన వారిని గొప్ప వారు అనవచ్చు.ఒకటి లేదా రెండు కుక్కలను పెంచడమే చాలా గొప్ప విషయంగా భావిస్తారు.

 Wife Picks Dogs Over Husband-TeluguStop.com

అలాంటిది ఆమె ఏకంగా 30 కుక్కలను పెంచుతోంది.అయిదు పదుల వయసు దాటిన ఆమె తన కుక్కల సంఖ్య సంవత్సరం సంవత్సరంకు పెంచుతూనే ఉంది.

ఆమెకు కుక్కలపై విపరీతమైన ప్రేమ మొదలైంది.ఎంతగా అంటే కట్టుకున్న భర్తను మరియు కన్న కొడుకును కూడా కాదనుకునేంతగా కుక్కలపై ప్రేమను పెంచుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.
ఇంగ్లాండ్‌కు చెందిన లిజ్‌ అనే మహిళకు చిన్నప్పటి నుండి కూడా కుక్కలపై మమకారాన్ని పెంచుకుంది.

వాటిపట్ల ప్రేమగా ఉండటం చేసేది.లిజ్‌కు పాతిక సంవత్సరాల క్రితం మైక్‌ హస్లమ్‌ అనే వ్యక్తితో పెళ్లి జరిగింది.

పెళ్లి తర్వాత కూడా ఆమె కుక్కల ప్రేమ తగ్గలేదు.భర్త ఉదయం డ్యూటికి వెళ్లి రాత్రి ఎప్పుడో లేట్‌ గా ఇంటికి వచ్చే వాడు.

దాంతో ఆ సమయంలో ఆమెకు టైం పాస్‌ కుక్కలతోనే అయ్యేది.ఆమె కుక్కలను కన్న పిల్లల మాదిరిగా జాగ్రత్తగా చూసుకునేది.

తన కడుపులో ఒక బాబు పుట్టినా కూడా కుక్క పిల్లలను మాత్రం ఆ బాబుతో సమానంగా చూసుకుంటూ వచ్చేది.ఈమద్య కాలంలో ఆమె కుక్క పిల్లల పిచ్చి మరీ ఎక్కువ అయ్యింది.

ఇంటి నిండా కుక్కపిల్లలు అవ్వడంతో ఆ భర్తకు కోపం వచ్చింది.ఒకటి రెండు అంటే ఏమో కాని 30 కుక్కలు ఎందుకు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు.విసిగి పోయిన అతడు నీకు కుక్కలు కావాలో, మేము కావాలో నిర్ణయించుకో అంటూ ఆమెకు అల్టిమేటం జారీ చేశాడు.ఆ సమయంలో ఆమె నాకు కుక్క పిల్లలు కావాలి అంటూ భర్తనే ఇంట్లోంచి వెళ్లి పోమంటూ తేల్చి చెప్పింది.

దాంతో ఆ భర్త ఇంట్లోంచి వెళ్లి పోయాడు.

నా భర్త ఆఫీస్‌ పనితో బిజీగా ఉన్న సమయంలో నాకు కుక్క పిల్లలు ఎంతో తోడుగా ఉన్నాయి.వాటిని నేను కన్న పిల్లల మాదిరిగా చూసుకున్నాను.వాటిని ఇప్పుడు వదిలేయమంటే ఎలా అంటూ లిజ్‌ అంటోంది.

పిల్లలను అనాధల వదిలేసేందుకు ఏ తల్లి ఒప్పుకోదు, నేను కూడా కుక్క పిల్లలను వదిలేసేందుకు ఒప్పుకోలేదు అంటూ భర్త వదిలేయడంపై లిజ్‌ స్పందించింది.

ఇప్పుడు చెప్పండి ఈమెను ఏమనాలో?

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube