ప్రస్తుతం తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో బయోపిక్ లో హడావిడి ఎక్కువగా కనిపిస్తోంది.ఒక బయోపిక్ హిట్టవ్వడంతో …వరుసగా అంతా ఇప్పుడు అదే బాట పట్టారు.
ప్రముఖుల జీవితాలను తెరకెక్కించేందుకు తెగ ఆరాటపడుతున్నారు.మొన్నా మధ్య మహానటి సావిత్రి బయోపిక్ తెరపైకి రాగా… యాత్ర పేరుతో వైయస్ రాజశేఖర్ రెడ్డి బయోపిక్, అలాగే ఎన్టీఆర్ కథానాయకుడు, లక్ష్మీస్ ఎన్టీఆర్ …ఇలా చెప్పుకుంటూ పోతే అనేకం తెరకెక్కాయి.అలాగే… అక్కినేని నాగేశ్వరావు బయోపిక్ కూడా తెరకెక్కుతుందని వార్తలు వినిపించినా…ఆ విషయాన్ని అక్కినేని ఫ్యామిలీ ఖండించింది.ఇక సూపర్ స్టార్ కృష్ణ బయోపిక్ కూడా తెరకెక్కించేందుకు చర్చలు జరుగుతున్నాయి.
ఇక మిగిలింది మెగాస్టార్.ఎంతో కింద స్థాయి నుంచి ఆ స్థాయికి ఎదిగే క్రమంలో ఎన్నో ఎత్తుపల్లాలను చూశాడు చిరంజీవి.ఈ నేపథ్యంలోనే ఆయన జీవిత గాధను తెరకెక్కించేందుకు చర్చలు సాగుతున్నాయని సమాచారం.ఈ బయోపిక్ లో చిరు చిన్ననాటి సంగతులు… చిరు ఫిలిం ఇండస్ట్రీలో అడుగుపెట్టడం, అక్కడ మెగాస్టార్ గా వెలుగొందడం.
ఆ తర్వాత ప్రజారాజ్యం పార్టీ పేరుతో ప్రజల్లోకి వెళ్లడం… ఇలా మొత్తం అన్ని విషయాలను ఈ సినిమాలో కనిపించేలా కథను తయారు చేస్తున్నారట.అయితే ఈ చిత్రంలో మెగాస్టార్ పాత్ర ఎవరు పోషిస్తారు అనేది మాత్రం ఇంకా బయటకి రాలేదు.