మజిలీతో జోష్ చూపించిన చైతు-సామ్ జోడీ! 2 మిలియన్ క్రాస్!

అక్కినేని ఫ్యామిలీ హీరోలకి గత రెండు సంవత్సరాలు ఎ మాత్రం కలిసి రాలేదు అని చెప్పాలి.చైతు చివరిగా చేసిన మూడు సినిమాలు అతనికి సక్సెస్ ఇవ్వలేకపోయాయి.

 Majili Movie Crossed 2 Million Views With In 6 Hours-TeluguStop.com

ఇక నాగార్జునకి కూడా దేవదాసు సినిమా డిజాస్టర్ గా తన ఖాతాలో చేరిపోయింది.ఇక సమంత యూటర్న్ సినిమా కూడా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేదు.

అయితే తమిళంలో సమంత సీమరాజాతో సూపర్ హిట్ కొట్టింది.తెలుగులో యూటర్న్ తర్వాత ఇప్పటి వరకు ఇంకో సినిమా ప్రేక్షకుల ముందుకి రాలేదు.

ఈ నేపధ్యంలో లవ్ కపుల్ చైతు- సమంత జోడీగా చాలా గ్యాప్ తర్వాత మరో లవ్ స్టొరీ ప్రేక్షకుల ముందుకి వస్తుంది.శివ నిర్వాన దర్శకత్వంలో మజిలీ టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది.

విశాఖ బ్యాక్ డ్రాప్ లో పీరియాడికల్ లవ్ స్టొరీగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో చైతు-సమంత స్క్రీన్ మీద కూడా భార్య భర్తలుగా నటిస్తున్నారు.

ఇదిలా వుంటే తాజాగా ఈ సినిమాకి సంబంధించిన టీజర్ ప్రేమికుల రోజు సందర్భంగా ప్రేక్షకుల ముందుకి వచ్చింది.

ఈ టీజర్ ఎమోషనల్ డ్రామాగా దర్శకుడు శివ నిర్వాణ తెరకేక్కిస్తున్నాడు.ఇక ఈ సినిమా టీజర్ ప్రేక్షకులని విశేషంగా ఆకట్టుకుంటుంది.ఇదిలా వుంటే ఈ సినిమా టీజర్ రిలీజ్ అయిన ఆరు గంటల్లోనే ఏకంగా రెండు మిలియన్ వ్యూస్ సొంతం చేసుకొని ఆడియన్స్ ని విశేషంగా ఆకట్టుకుంటుంది.ఇందులో సమంత, చైతు మధ్య కెమిస్ట్రీ భాగా కుదిరినట్లు తెలుస్తుంది.

ఇష్టం లేని భార్యతో జీవితం పంచుకునే భర్తగా చైతు, భర్తని విపరీతంగా ప్రేమించే భార్యగా సమంత జోడీ స్క్రీన్ మీద బాగుంది అనే టాక్ వినిపిస్తుంది.దీంతో ఈ సినిమా అక్కినేని ఫ్యామిలీకి సక్సెస్ లోటుని తీర్చే అవకాశం వుందని టాలీవుడ్ లో టాక్ వినిపిస్తుంది.

మరి థియేటర్ లో ఈ సినిమా ఆడియన్స్ ని ఎ మేరకు ఆకట్టుకుంటుంది అనేది చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube