ఔను వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు! కోలీవుడ్ లో నయా లవ్ స్టొరీ!

బాలీవుడ్ లో హీరో, హీరోయిన్స్ మధ్య డేటింగ్, లవ్ అనేవి సాధారణంగా కనిపిస్తూ వుంటాయి.అయితే సౌత్ ఇండస్ట్రీకి వచ్చే సరికి మన హీరోలు చాలా మంది హీరోయిన్స్ లో ప్రేమాయణానికి దూరంగా వుంటారు.

 Hero Arya And Sayyeshaa Getting Married This March-TeluguStop.com

వారికి ప్రేమ కథల వున్నా ఇండస్ట్రీతో సంబంధం లేని వారిని ప్రేమించి, పెళ్లి చేసుకుంటారు.అయితే సౌత్ లో కూడా అమల, నాగార్జున, సూర్య, జ్యోతిక, రాజశేఖర్, జీవిత తరహాలో కొన్ని ప్రేమ కథలు వున్నాయి.

ఇదిలా వుంటే ఇప్పుడు కోలీవుడ్ ఇండస్ట్రీలో మరో ప్రేమ కథ చిగురించింది.అయితే ఈ ప్రేమ కథ గురించి ఇన్ని రోజులు ఊహాగానాలు వినిపించిన వేలెంటైన్ డే సందర్భంగా వారి ప్రేమపై స్పష్టత వచ్చేసింది.

కోలీవుడ్ లో హీరోగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న నటుడు ఆర్య.ఆర్య బన్నికి విలన్ గా వరుడు సినిమాలో నటించి తెలుగు ప్రేక్షకులకి కూడా దగ్గరయ్యాడు.

అతని తమిళ సినిమాలు తెలుగులో కూడా రిలీజ్ అయ్యి ఇక్కడి ప్రేక్షకులని ఆకట్టుకున్నాయి.ఇక టాలీవుడ్ లో అఖిల్ తెరంగేట్ర మూవీ అఖిల్ తో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన బాలీవుడ్ భామ షాయేషా సైగల్ కోలీవుడ్ లో ఆర్యకి జోడీగా గజనిస్తాన్ అనే సినిమాలో నటించింది.

అక్కడ వీరిదరి మధ్య ప్రేమ చిగురించింది.దీంతో ఇద్దరు వారి కుటుంబ సభ్యులని ఒప్పించి పెళ్లికి రెడీ అవుతున్నారు.మార్చి నెలలో వీరి పెళ్లి హైదరాబాద్ లో జరిగే అవకాశం వుందని తెలుస్తుంది.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube