దెబ్బకు దెబ్బ...ఇదీ జగన్ లెక్క...!!!

అదును చూసి దెబ్బ కొట్టడమే రాజకీయమం.పట్టు లేని సమయంలో, తనది కాదనుకున్న తరుణంలో ప్రత్యర్ధి పార్టీ వ్యక్తి నలుగురు ముందు బండబూతులు తిట్టినా సరే తనని కాదన్నట్టుగా చిరునవ్వులు చిందించుకుంటూ, అవకాశం కోసం ఎదురు చూసేవాడే రాజకీయాల్లో రాణించగలడని చరిత్ర చెప్తూనే ఉంది.

 Ys Jagan Give Treatment To The Chandrababu Naidu-TeluguStop.com

వాళ్ళే రాజకీయాల్లో శాశ్వతంగా నిలదొక్కుకుంటారు అనేది రాజకీయ నీతి.అదే ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి పాటిస్తున్నాడు.

ఇప్పుడు అదును దొరికింది.తన వ్యుహాలకి పదును పదును పెడుతున్నాడు.

జగన్ పాదయాత్ర మొదలు పెట్టిన సమయంలో జగన్ యాత్రకి మైలేజ్ రాకుండా చేయడానికి , జగన్ పని అయిపోయిందని వైసీపీ పార్టీ నేతల్లో కలవరం పెంచడానికి , ప్రజల్లో జగన్ క్రేజ్ తగ్గించడానికి బాబు జగన్ పై వదిలిన అస్త్రాలని ఇప్పుడు జగన్ మళ్ళీ బాబుపైనే ప్రయోగిస్తున్నాడు.సరిగ్గా జగన్ పాదయాత్ర ప్రారంభం అయిన రోజు మొదలు వరుస పెట్టి వైసీపీ ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేయించి, పచ్చ కండువా కప్పుకునేలా చేశారు.

అయితే జగన్ ఆ పరిణామాలు అన్నిటీనీ నవ్వుతూనే భరించాడు.తనతో పాటు ఉండేవాళ్ళు ఉంటారు లేదంటే వెళ్ళిపోతారు అని తేలిగ్గానే తీసుకున్నాడు.అయితే చంద్రబాబు కి నేతల జంపింగ్ ల ఎఫెక్ట్ చూపించాలని అప్పుడే ఫిక్స్ అయిన జగన్ ఇప్పుడు బాబు ప్రయోగించిన అస్త్రాలని తిప్పి బాబు వైపు సంధిస్తున్నాడు.ఈ క్రమంలోనే

టీడీపీ లో పక్కాగా గెలుపు అందుకునే అభ్యర్ధులని ఒక్కొక్కరుగా వైసీపీలోకి వచ్చేలా జగన్ పావులు కదుపుతున్నారు.

అందులో భాగంగానే

ప్రకాశం జిల్లా చీరాల ఎమ్మెల్యే ఆమంచి టీడీపీ కి రాజీనామా చేసి నిన్నటి రోజున జగన్ సమక్షంలో వైసీపీ లో చేరిపోయారు.ఆమంచి పార్టీ మారుతారని తెలుసుకున్న సమయం మొదలు బాబు తీవ్రమైన ఆందోళన ఎదుర్కున్నారని తెలుస్తోంది.

చీరాలలో తిరుగులేని నేతగా ఉన్న ఆమంచి పార్టీ విడిచి వెళ్ళకుండా ఉండేందుకు నేరుగా చంద్రబాబు సంప్రదింపులు జరిపినా సరే , ససేమిరా అంటూ జగన్ పంచన చేరిపోయారు కృష్ణ మోహన్.అయితే ఇదంతా జగన్ రెడ్డి వ్యూహంలో భాగమన్నది అందరికి తెలిసిన విషయమే.ఆమంచి బాటలోనే

టీడీపీ కీలక నేత లోక్ సభ సభ్యుడు అవంతి శ్రీనివాస్ పార్టీని వీడనున్నారని తెలుస్తోంది.ఇలా ఒకరి తరువాత మరొకరు అందులోనూ టీడీపీ కి అత్యంత కీలకమైన వ్యక్తులు పార్టీని వీడేలా జగన్ వ్యుహలని సిద్దం చేశారట.మరొక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే టీడీపీ నుంచీ అత్యంత కీలకమైన వ్యక్తులు , సీనియర్ నేతలతో సహా దాదాపు 20 మంది నేతలు పార్టీని వీడనున్నారని టాక్ వినిపిస్తోంది.జగన్ పాదయాత్ర సమయంలో బాబు ఇచ్చిన గిఫ్ట్ కి జగన్ ఇచ్చే రిటర్న్ గిఫ్ట్ ఇదే అంటున్నారు విశ్లేషకులు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube