ఆ చిన్నారి గుండె శరీరం బయటకు వచ్చింది... ఆ పాప కోసం తల్లిదండ్రులు పడ్డ కష్టం తెలిస్తే కన్నీరు ఆగవు

పెద్ద వారే చిన్న గాయం అయితే తట్టుకోలేరు, అలాంటిది అప్పుడే పుట్టిన పసి పాపాయికి గుండె ఆపరేషన్‌ అంటే మామూలు విషయం కాదు.యూకేకు చెందిన వానిలోప్‌ విల్కిన్స్‌ అనే చిన్నారికి పుట్టిన కొన్ని వారాల్లోనే గుండె ఆపరేషన్‌ చేశారు.

 Baby Born With Heart Outside Chest Returns Home-TeluguStop.com

ఆ పాప తల్లి గర్బంలో ఉండగానే గుండె బయటకు వచ్చింది.దాంతో తల్లిదండ్రులు ఆ పాపను కడుపులో ఉండగానే చాలా జాగ్రత్తగా చూసుకుంటూ వచ్చారు.

వైధ్యులు ఆ పాప బయటకు వచ్చిన తర్వాత బతికేది అనుమానమే అంటూ చెప్పారు.కాని ఆ తల్లిదండ్రులు మాత్రం అత్యంత జాగ్రత్తగా పాపను కడుపులో పెంచారు, డెలవరీ అయిన తర్వాత కూడా పాప కోసం చాలా కష్టపడ్డారు.

పాప జన్మించిన తర్వాత బతికే ఛాన్స్‌ లు 10 శాతమే అన్నారు వైధ్యులు.అయితే తల్లిదండ్రుల బలమైన కోరిక ఆ పాపను బతికించింది.గుండె బయట ఉండి పుట్టిన ఆ పాపకు ఆపరేషన్‌ చేసి వైధ్యులు గుండెను లోపల అమర్చారు.అయితే ఆ పాపకు ఛాతి ఎముకలు లేవు.

చాతి ఎముక లేకపోవడంతో గుండె బయటకు వచ్చింది.ఇప్పటికి కూడా ఛాతి ఎముక లేకపోవడం వల్ల గుండె ప్రదేశంలో ఆ పాపకు చిన్న దెబ్బ తలిగినా కూడా అది గుండెకు నేరుగా తలుగుతుంది.

దాంతో ఆ పాప ప్రాణాలకే ప్రమాదం వాటిల్లుతుంది.

తల్లిదండ్రులు లక్షలు ఖర్చు చేసి ఆ పాపకు ఆపరేషన్‌ చేయించడంతో పాటు ఛాతి ఎముకలు పెరిగేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.ఛాతి ఎముకల వల్ల గుండెకు ఎలాంటి ప్రమాదం ఉండదు.అయితే ఛాతి ఎముక పెరిగేందుకు కొన్ని సంవత్సరాలు అయినా పడుతుందని వైధ్యులు చెప్పారు.

అప్పటి వరకు ఆ పాపకు ఒక కవచం వంటిది వేశారు.ఆ కవచం ఎప్పటికి అలాగే ఉండాలి.

కర్ణుడికి కవచ కుండలాల మాదిరిగా ఆ పాపకు ఛాతి ఎముకలు వచ్చే వరకు ఉండాల్సిందేనట.

పుట్టినప్పటి నుండి 14 నెలల పాటు హాస్పిటల్‌లోనే ఉంటూ, కేవలం సెలైన్స్‌ మందులతోనే జీవించేసిన ఆ పాప తాజాగా డిశ్చార్జ్‌ అయ్యి తల్లిదండ్రులతో ఇంటికి వెళ్లింది.ఆ పాప ఆరోగ్యం ప్రస్తుతం బాగానే ఉందని, కాకుంటే చిన్న పిల్ల కనుక గుండెకు సమస్య కనుక కంటికి రెప్పలా చూసుకోవాలని వైధ్యులు సూచించారట.ఆ పాపాయి కోసం తల్లిదండ్రులు పడ్డ కష్టంకు అంతా సెల్యూట్‌ చేయాల్సిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube