వేలెంటైన్ డే రోజు ప్రేమికులని అడ్డుకుంటాం! హిందూ సంస్థల హెచ్చరికలు!

ఫిబ్రవరి 14 వేలెంటైన్ డే వచ్చిందంటే దేశంలో ప్రేమికులుగా చెప్పుకునే యువత హద్దులు లేకుండా విచ్చల విడిగా రెచ్చిపోతూ వుంటారు.పార్క్ లు, పబ్ లలో హడావిడి చేస్తూ వుంటారు.

 Hindu Activists Warns Lovers For Valentine Day-TeluguStop.com

అయితే భారతీయ సంప్రదాయాలకి విరుద్ధమైన ఈ వేలెంటైన్ డే ని హిందుత్వ సంస్థలు తీవ్రంగా వ్యతిరేకిస్తూ వుంటారు.ప్రేమ జంటలు కనిపిస్తే దాడులు చేయడం, లేదంటే పెళ్ళిళ్ళు చేయడం ప్రతి ఏడాది జరుగుతూ వుంటుంది.

అయితే ప్రేమికుల స్వేచ్చని అడ్డుకునే హక్కు ఎవరికీ లేదని, హిందుత్వ ముసుగులో దాడులు చేయడం అరాచకం అని వాదించే లౌకిక వాదులు,వాదిస్తూ వుంటారు.

మరో సారి ఫిబ్రవరి 14 రానే వచ్చింది.

ఇక ప్రేమికులు ప్రేమికుల రోజుని సెలబ్రేట్ చేసుకోవడానికి రెడీ అవుతున్నారు.అయితే వేలెంటైన్ డే పేరుతో విచ్చలవిడిగా అడ్డు, అదుపు లేకుండా ప్రవర్తిస్తే తమ ప్రతాపం చూపించాల్సి వస్తుందని హిందుత్వ సంస్థలు ఇప్పటికే హెచ్చరికలు ఇస్తున్నారు.

హద్దులు మీరి ప్రవర్తిస్తే కచ్చితంగా తమ ప్రతాపం చూపిస్తామని ఇప్పటికే తమ వార్నింగ్ ఇచ్చారు.అయితే హిందుత్వ ముసుగులో యువతని, అలాగే ప్రేమికులని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తే తమ ప్రతాపం చూపించాల్సి వస్తుందని విద్యార్ధి సంఘాలు కూడా రివర్స్ కౌంటర్ ఇస్తున్నాయి.

మరో వైపు లౌకిక వాదులు కూడా హిందుత్వ సంస్థలు దాడులు చేస్తే సహించేది లేదని హెచ్చరిస్తున్నారు.యువతరం స్వేచ్చని డిస్టర్బ్ చేస్తే చూస్తూ ఊరుకోమని వార్నింగ్ ఇచ్చారు.

మరి ఓ వైపు హిందుత్వ సంస్థలు, మరో వైపు విద్యార్ధి సంఘాల మాటల దాడుల మధ్య ప్రేమికుల రోజు వేడుకలని ప్రేమికులు ఎలా చేసుకుంటారో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube