100 ఏళ్ల ఈ తాతకు తన పిల్లల పేర్లు గుర్తు లేవు, కాని అవి మాత్రం గుర్తుకు ఉన్నాయి

కళను నమ్ముకున్న వాడు ఎప్పటికి నష్టపోడు అనేది ఒక నానుడి ఉంటుంది.కళ ఏది అయినా దాంట్లో రాణిస్తే తప్పకుండా తిండి పెడుతుంది, దాంతో పాటు పేరు తెస్తుంది అనేది అందరి అభిప్రాయం.

 100 Year Old And Memory Loss Still Remembers Yakshagana Songs-TeluguStop.com

కొన్ని కళలు అంతరించి పోతున్నా కూడా వాటినే నమ్మకున్న వారు వాటితో చాలా గుర్తింపును దక్కించుకుంటూనే ఉన్నారు.కొందరు మాత్రం పాతబడ్డ కళలను వదిలేస్తున్నారు.

దాదాపు 60 ఏళ్ల పాటు యక్షగానం చేసిన 100 ఏళ్ల వెంకట్రాయ నాయక్‌ తన జీవితాన్ని అంతా మర్చి పోయినా కూడా తనను నిలబెట్టిన కళను మాత్రం మర్చి పోలేదు.అదే కళకు ఉన్న గొప్పదనంగా చెప్పుకోవచ్చు.

కర్ణాటకకు చెందిన వెంకట్రాయ నాయక్‌ ఇటీవలే సెంచరీ కొట్టి నాటౌట్‌ గా నిలిచాడు.ఆరోగ్యం అంతా బాగనే ఉన్నా ఈయన అల్జీమర్స్‌ అంటే మతిమరువు వ్యాదితో బాధపడుతున్నాడు.

చాలా విషయాలను మర్చి పోయాడు.చివరకు తన పిల్లల పేర్లను కూడా మర్చి పోయాడు.

ప్రస్తుతం ఆయన జీవితం అంతా కూడా తెల్లని కాగితాలతో నిండిన నోట్‌ బుక్‌ వంటిది, ఆయనకు ఏదీ గుర్తు లేదు అని కుటుంబ సభ్యులు అనుకున్నారు.ఇటీవలే ఆయన భార్య మృతి చెందింది.

ఆ సందర్బంగా కుటుంబ సభ్యులు అంతా కూడా వెంకట్రాయ యక్షగాణం వినాలనుకున్నారు.వారందరికి తెలుసు ఆయన మొత్తం మర్చి పోయి ఉంటాడు, పాడలేడు అని, అయినా కూడా ప్రయత్నిద్దాం అంటూ ఆయనతో పాడించారు.

పిల్లల పేర్లు, తన గతంను గుర్తు పెట్టుకోలేక పోయిన వెంకట్రాయ నాయక్‌ తాను చిన్నప్పటి నుండి పాడుతున్న యక్షగాన పాటలను మాత్రం మర్చి పోలేదు.చిడతలు కొడుతూ మరీ జోష్‌ గా పాటలు పాడాడు.ఆయన పాటకు కుటుంబ సభ్యులు అంతా అవాక్కయ్యారు.కనీసం పేర్లు గుర్తు లేవు కాని ఆయనకు పాటలు మొత్తం గుర్తుకు ఉండటం ఆశ్చర్యంగా అనిపించింది.

ఆయన కళను ఎంతగా ఆరాధించాడో దీన్ని బట్టి అర్థం అవుతుంది.తనకు జీవితాన్ని ఇచ్చిన కళను ఆయన మర్చి పోలేదు.ఆయనకు వచ్చిన జబ్బు కూడా ఆయన నుండి కళను వేరు చేయలేక పోయింది.కళ అనేది జీవితంలో భాగం అయిన వారు ఎన్ని ఇబ్బందులు వచ్చినా దాన్ని అలాగే కలిగి ఉంటారు అని ఈ సంఘటనతో నిరూపితం అయ్యింది.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube