తమిళ స్టార్ హీరోతో ఫైటింగ్ చేస్తున్న యంగ్ మెగా హీరో!

మెగా ఫ్యామిలీ నుంచి మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ తేజ్ హీరోగా ఎంట్రీ ఇస్తున్న సంగతి అందరి తెలిసిందే.ఈ సినిమాని సుకుమార్ రైటింగ్స్ తో పాటు, మైత్రీ మూవీ మేకర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

 Vijay Setupathi Is Ready To Act As A Vilan To Mega Hero-TeluguStop.com

ఇక ఈ సినిమాతో సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు దర్శకుడుగా పరిచయం అవుతున్నాడు.ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ ని దర్శకుడు మొదలెట్టేసాడు.

అలాగే వైష్ణవ్ తేజ్ ని పరిచయం చేస్తూ రిలీజ్ చేసిన సినిమా పోస్టర్ తో ఈ సినిమాలో వైష్ణవ్ ఓ జాలారి యువకుడుగా కనిపిస్తున్నాడని తెలుస్తుంది.ఇక ఈ సినిమాకి కూడా సుకుమార్ ఆస్థాన మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.

మెగా మేనల్లుడుని గ్రాండ్ గా పరిచయం చేస్తున్న ఈ సినిమాలో విలన్ గా కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతిని దర్శకుడు ఫైనల్ చేసినట్లు టాక్ వినిపిస్తుంది.వైష్ణవ్ కి విజయ్ సేతుపతి అయితే కరెక్ట్ గా సరిపోతాడని, అతనిని ఎంపిక చేసినట్లు సమాచారం.

ఇప్పటికే మెగాస్టార్ హీరోగా తెరకెక్కుతున్న సైరా నరసింహా రెడ్డి సినిమాలో విజయ్ సేతుపతి ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు.దీంతో విజయ్ ని ఈ సినిమా కోసం ఒప్పించడం ఈజీ అయ్యిందని తెలుస్తుంది.

మరి విజయ్ సేతుపతి వైష్ణవ్ కి విలన్ గా నటిస్తే ఈ సినిమాపై భారీ హైప్ క్రియేట్ అయ్యే అవకాశం వుందని తెలుస్తుంది.ఇక మార్కెట్ పరంగా కూడా తెలుగు, తమిళ భాషలలో రిలీజ్ చేసుకోవడానికి వీలుగా వుంటుంది.

మరి సుకుమార్ టీం విజయ్ ని ఎంపిక చేయడం వెనుక ప్లాన్ ఏంటి అనేది చూడాలి.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube