ప్రముఖ దర్శకుడు విజయబాపినీడు మృతి!

విజయ బాపినీడు అంటే ప్రస్తుత తరం సినీ అభిమానులకి పెద్దగా తెలిసే అవకాశం లేకపోయినా, గ్యాంగ్ లీడర్, ఖైది నెంబర్ 786 లాంటి సూపర్ హిట్స్ ని చిరంజీవికి అందించిన దర్శకుడుగా విజయ బాపినీడు పేరు అందరికి తెలుస్తుంది.1976లో నిర్మాతగా కెరియర్ స్టార్ట్ చేసిన విజయ బాపినీడు తర్వాత దర్శకుడుగా మారి 19 చిత్రాలని తెరకెక్కించాడు.ఆతని కెరియర్ లో మెగాస్టార్ చిరంజీవితో ఏడు సినిమాలకి పైగా దర్శకత్వం వహించారు.ఇక రాజేంద్ర ప్రసాద్, సూపర్ స్టార్ కృష్ణ లాంటి స్టార్ హీరోలతోనే సినిమాలు తెరకెక్కించారు.

 Senior Director Vijaya Bapineedu Passes Away-TeluguStop.com

ఇదిలా వుంటే టాలీవుడ్ స్టార్ దర్శకుడుగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని సొంతం చేసుకున్న విజయ బాపినీడు తాజాగా మృతి చెందారు.గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన తాజాగా మృతి చెందారు.

ఈ మరణ వార్తని అధికారికంగా దృవీకరించారు.ఆయన మరణ వార్త విని తెలుగు చిత్ర ప్రముఖులు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేసారు.

తెలుగు చిత్ర పారిశ్రమలో గొప్ప దర్శకుడుగా గుర్తింపు తెచ్చుకున్న అతని మరణం చిత్ర పరిశ్రమకి తీరని లోటని పేర్కొన్నారు.అతని మృతికి చిత్ర ప్రముఖులు తీవ్ర సతాపం తెలియజేసారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube