హరీష్ రావు రాజీనామా...? ఈ వార్త వెనుక రీజన్ ఏంటి...?

తెలంగాణ రాజకీయాల్లో ఎప్పుడూ ఎదో ఒక సంచలన వార్త హాట్ టాపిక్ గా వినిపిస్తూనే ఉంటాయి.ముఖ్యంగా అధికార పార్టీ టీఆర్ఎస్ లో ఈ పరిస్థితులు ఎక్కువ.

 The Reason Why Harish Rao Want To Quit From Trs-TeluguStop.com

అయితే ఇప్పుడు వస్తున్న వార్తలు మాత్రం టీఆర్ఎస్ పార్టీలో మొన్నటివరకు కీ రోల్ పోషించిన హరీష్ రావు మీదే.ఇంతకీ విషయం ఏంటి అంటే…? త్వరలో హరీష్ రావు రాజీనామా చేయబోతున్నారు అనే వార్తే.అవును ఇప్పటి వరకు…త్వరలో కేసీఆర్ తన మంత్రి మండలిని విస్తరించబోతున్నారు… అందులో హరీష్ రావు కు మంత్రి వస్తుందా రాదా…? వస్తే ఏ శాఖ వస్తుంది…? తదితర అంశాలన్నీ ఇప్పటివరకు చర్చకు వచ్చాయి.అయితే ఇప్పుడు హరీష్ రావు రాజీనామా చేయబోతున్నారు అనే వార్త సంచలనంగా మారింది.

ఇదే అంశంపై సీఎం, తెరాస అధినేత కేసీఆర్ అన్న కుమార్తె, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి ఆర్.రమ్యారావు ఒక ట్వీట్ చేశారు.ఇది ఇపుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.తాజా తెలంగాణ హెడ్‌లైన్‌తో కాంగ్రెస్ వాట్సాప్ గ్రూపులో రమ్యారావు ఈ పోస్ట్ చేశారు.మరో నాలుగు నెలల్లో సిద్ధిపేటకు ఉప ఎన్నిక జరుగనుంది.ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా తన్నీరు శ్రీనిత పోటీ చేయనుందని అందులో పేర్కొన్నారు.

ఇపుడు టీఆర్ఎస్ తో పాటు.తెలంగాణ రాష్ట్ర రాజకీయవర్గాల్లో ఇది ఆసక్తికరంగా మారింది.

త్వరలో సార్వత్రిక ఎన్నికలు జరుగనున్నాయి.ఈ ఎన్నికల్లో హరీశ్ రావుతో పాటు.

కేసీఆర్ కూడా పార్లమెంట్‌కు పోటీ చేస్తారన్న ఊహాగానాలు వస్తున్నాయి.

ముఖ్యంగా, ఫెడరల్ ఫ్రంట్ ప్రయత్నాల్లో భాగంగా హరీశ్ రావును తనతో పాటు ఢిల్లీ రాజకీయాలకు తీసుకెళ్లాలనే యోచనలో కేసీఆర్ ఉన్నారు.దీనిపై జోరుగానే ప్రచారం సాగుతోంది.ఇలాంటి తరుణంలో సిద్ధిపేటకు ఉప ఎన్నిక.శ్రీనిత పొలిటికల్ ఎంట్రీ అన్న వార్త తెరపైకి రావడంపెద్ద సంచలనం కలిగిస్తోంది.అయితే… తెలంగాణాలో కేటీఆర్ కు ఎటువంటి ఆటంకం లేకుండా… భవిష్యత్తులోనూ … హరీష్ కేటీఆర్ కు పోటీ కాకుండా కేసీఆర్ ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నాడని… అందులో భాగంగానే హరీష్ ను సైడ్ చేస్తున్నారని కూడా మరో వాదన తెరపైకి వస్తోంది.ఏది ఏమైనా… కేసీఆర్ మాత్రం తాను అనుకున్నది సాధించడంలో ఎప్పుడూ సక్సెస్ అవుతాడనే విషయం అందరికీ తెలిసిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube