ఈ ఒక్క ఫోటోను బట్టి మీ మానసిక స్థితి ఎలా ఉందో చెప్పేయొచ్చు.! ఈ 3 రకాల్లో మీకు ఎలా కనిపిస్తుంది.?

సైకాల‌జిస్టులు త‌మ వ‌ద్ద‌కు ట్రీట్‌మెంట్ కోసం వ‌చ్చే వారికి అనేక ర‌కాలుగా టెస్ట్‌లు చేస్తార‌న్న విష‌యం తెలిసిందే.అందులో అనేక విధాలైన ప‌రీక్ష‌ల‌ను వారు నిర్వ‌హిస్తారు.

 A Singile Photo Tells Your Mental Situation-TeluguStop.com

వాటిల్లో ఒక‌టి పేషెంట్ మాన‌సిక స్థితిని అంచనా వేయ‌డం.ఇందుకు అనేక మంది సైకాల‌జిస్టులు అనేక మెథ‌డ్స్ ఫాలో అవుతారు.

అయితే అలాంటి మెథ‌డ్స్‌లో ఒక విధానం గురించే కింద తెలియ‌జేస్తున్నాం.దాని ప్ర‌కారం మీరు కింద చెప్పే సూచ‌న‌లు ఫాలో అయితే మీ మాన‌సిక స్థితి ఎలా ఉందో తెలుసుకోవచ్చు.

మ‌రి ఆ మెథ‌డ్ ఏంటో ఇప్పుడు చూద్దామా.!

పైన ఇచ్చిన ఫొటోను కేవ‌లం 10 సెకండ్ల పాటు మాత్ర‌మే చూడండి.త‌రువాత మీరు అందులో మొద‌టగా ఏం చూశారో చెప్పండి.

1.గుహ‌ను చూసి ఉంటే…


మీరు మాన‌సికంగా ప్ర‌శాంతంగా ఉన్నట్లు లెక్క‌.మీ మాన‌సిక స్థితి బ్యాలెన్స్ ను త‌ప్పించడం ఎవరి వ‌ల్లా కాదు.మీకు లోప‌ల చాలా బ‌లం ఉంటుంది.ఎలాంటి నెగెటివ్ సంద‌ర్భం కూడా మీపై ఒత్తిడి పెంచ‌లేదు.

మిమ్మ‌ల్ని ఇత‌రులు స‌ల‌హాలు, సూచ‌న‌లు, స‌హాయం అడుగుతారు.మిమ్మ‌ల్ని ప్రేమించే వారికి మీ స‌పోర్ట్ ఇవ్వండి.

పాజిటివ్ ఎన‌ర్జీ పెంచండి.

2.మీరు యూఎఫ్‌వో (ఫ్ల‌యింగ్ సాస‌ర్‌)ను చూసి ఉంటే…


పైన ఇచ్చిన చిత్రంలో మీరు యూఎఫ్‌వోను చూసి ఉంటే మీరు సున్నిత‌మైన మ‌న‌స్త‌త్వం క‌లిగి ఉంటారు.చిన్న విష‌యానికి కూడా భావోద్వేగానికి గుర‌వుతారు.

ఒత్తిడి మీపై పైచేయి సాధిస్తుంది.నిద్ర‌లేమి స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతుంటారు.

కొన్ని సార్లు భావోద్వేగాల‌ను అణ‌చుకునే ప్ర‌య‌త్నం చేస్తారు.దీంతో అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయి.

క‌నుక అలా చేయ‌కండి.మీ భావాల‌ను బ‌య‌ట పెట్టండి.

3.గ్ర‌హాంత‌ర వాసి (ఏలియ‌న్‌) ముఖం చూసి ఉంటే…


ప్ర‌తి విష‌యంలోనూ మీరు స‌మ‌స్య‌లు సృష్టిస్తారు.బాగా ఒత్తిడి, ఆందోళ‌న‌కు లోన‌వుతుంటారు.చిన్న‌పాటి విష‌యాల‌పై కూడా తీవ్రంగా ఆలోచ‌న చేస్తారు.క‌నుక వాటి గురించి ఆలోచించ‌డం మానేయాలి.ఏదైనా ఒక సంఘ‌ట‌న‌లో ఇబ్బంది ఎదురైతే దాన్ని అధిగ‌మించేందుకు ప్ర‌య‌త్నించాలి.

నిత్యం మీకు క‌లిగే ఒత్తిడిని నివారించేందుకు శ్వాస‌కు సంబంధించిన వ్యాయామాలు చేయాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube