ఢిల్లీ టూర్ వెనుక జగన్ రాజకీయం ఏంటి...?

ఏపీ సీఎం చంరబాబు నాయుడు ఢిల్లీ టూర్ లో చేయాల్సిన రాజకీయం అంతా చేసేసాడు….కలవాల్సిన నాయకులందరినీ కలిసేసాడు.

 Political Plans Behind Ys Jagan Delhi Tour-TeluguStop.com

ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని చక చక చాపకింద నీరులా రాజకీయం చేసేసాడు.దీంతో ఇప్పుడు వైసీపీ అధినేత జగన్ లో కంగారు మొదలయ్యింది.

అందుకే హడావిడిగా ఢిల్లీ టూర్ ప్లాన్ చేసేసుకున్నాడు.అది కూడా….

పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న సమయంలో.ఈ ఢిల్లీ ప్రయాణం రాజకీయాల్లో చర్చకు దారి తీసింది.

జగన్ ఇప్పటి వరకూ పెద్దగా ఢిల్లీ వెళ్లి అక్కడి జాతీయ నేతలను కలిసిందిలేదు.ఏపీకి ప్రత్యేక హోదా కోసం ఆందోళన చేస్తున్న సమయంలో ఒకసారి, రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎన్నికల సమయంలో మరొకసారి ఢిల్లీ వెళ్లారు.

ప్రధాని మోదీని కలసి వచ్చారు.ఇక సమయమంతా పాదయాత్ర చేయడానికే కేటాయించేశారు.

తాజాగా ఏపీలోనూ, జాతీయ స్థాయిలోనూ చోటు చేసుకుంటున్న అనేక రాజకీయ పరిణామాలతో జగన్ ఢిల్లీ పర్యటనకు బయలుదేరుతున్నారు.ఈ నెల 4వ తేదీన జగన్ ఢిల్లీలోనే ఉంటారని వైసీపీ నాయకులు చెబుతున్నారు.

ఇప్పటికే చంద్రబాబు జాతీయ స్థాయి రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తున్నారు.బీజేపీకి మరోసారి అధికారం దక్కకుండా బీజేపీ వ్యతిరేక పార్టీలను ఏకం చేసి బీజేపీకి పొగపెట్టేలా బాబు చక్రం తిప్పుతున్నాడు.

కానీ ఈ విషయంలో జగన్ మాత్రం పెద్దగా తనకేమి సంబంధంలేనట్టుగా బీజేపీ , కాంగ్రెస్ రెండు పార్టీల మధ్య దూరం పాటిస్తూనే ఉన్నాడు.వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీకి పూర్తి మెజారిటీ రాదని.

కేంద్రంలో హంగ్ ప్రభుత్వం ఏర్పడటం ఖాయమని, అప్పుడు ఏపీ ఎంపీల అవసరం ఆయా పార్టీలకు ఉంటుందని నమ్ముతున్నారు.అలాంటి సమయంలో ఎన్నికల తర్వాత ఎవరైతే ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తారో ? వారికే తన మద్దతు ఉంటుందని జగన్ ఇప్పటికే ప్రకటించారు.

జగన్ ఏపీలో బస్సు యాత్ర ప్లాన్ చేసుకుంటున్న సమయంలో ఈ విధంగా… అర్ధాంతరంగా… ఈ టూర్ ప్లాన్ చేసుకోవడం అనేక కారణాలు కూడా ఉన్నాయి.ముఖ్యంగా…ఏపీలో ఓట్ల తొలగింపు అంశాన్ని జాతీయ స్థాయిలో చర్చకు వచ్చేలా చేసేందుకు జగన్ ఢిల్లీ పర్యటన అని తెలుస్తోంది.ఇటీవల విజయనగరం, కడప జిల్లాల్లో సర్వేల పేరుతో వైసీపీ ఓట్లను తొలగించడాన్ని కేంద్ర ఎన్నికల సంఘానికి జగన్ ఫిర్యాదు చేయబోతున్నారట.ఓట్ల తొలగింపు అంశాన్ని కేంద్ర ఎన్నికల దృష్టికి తీసుకెళ్లడమే కాకుండా జాతీయ స్థాయి నేతల దృష్టికి తీసుకెళ్లనున్నారు.

ప్రత్యేక హోదా, విభజన అంశాలపై జాతీయ నేతలతో చర్చించడమే కాకుండా రాష్ట్రపతిని కూడా జగన్ కలిసే అవకాశముందని తెలుస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube