ఈ షాప్‌లో షాప్‌ కీపర్స్‌ ఉండరు, ఇష్టం వచ్చింది కస్టమర్లు తీసుకోవడమే.. మరి డబ్బు సంగతేంటీ?

పెద్ద పెద్ద షాపింగ్‌ మాల్స్‌లో ఏదైనా వస్తువు దొంగిలించకుండా సీసీ కెమెరాలు పెట్టడంతో పాటు, బిల్‌ వేయించకుండా ఏదైనా వస్తువు బయటకు తీసుకు వెళ్తే హారన్‌ రావడం జరుగుతుంది.అందుకు పెద్ద షాపింగ్‌ మాల్స్‌లలో చిల్లర దొంగలు దొంగతనం చేసేందుకు భయపడతారు.

 This Kerala Shop Has No Shopkeeper And The Reason Will Touch Your Heart-TeluguStop.com

కాని చిన్న చిన్న కిరాణ షాపులు, చిన్న స్టోర్స్‌లలో చిల్లర దొంగలు ఎక్కువగా విజృంభిస్తూ ఉంటారు.ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా రోజు ఏదో ఒకటి పోతూనే ఉంటుందని స్టోర్‌ యజమానులు చెబుతూ ఉంటారు.

ఎంత మంది స్టాప్‌ ఉన్నా కూడా ఎలా పోతాయో అర్థం కావని కొందరు స్టోర్‌ యజమానులు అంటూ ఉంటారు.అయితే కేరళలలోని ఒక స్టోర్‌లో మాత్రం ఎవరు లేకున్నా ఒక్క వస్తువు కూడా పోదు.

కేరళలోని కన్నూర్‌ సమీపంలో ఉండే వంకులతువయాల్‌లో ఒక డిపార్ట్‌మెంటల్‌ స్టోర్‌ ఉంటుంది.అందులో ఇంటి అవసరాలకు ఉపయోగపడే డిజర్జెంట్‌ పౌండర్స్‌, వాషింగ్‌ సబ్బులు, టాయిలెట్‌ క్లీనర్స్‌, హ్యాండ్‌ వాష్‌, క్లాత్‌ బ్యాగ్స్‌ వంటి వస్తువులు దొరుకుతాయి.

వీటన్నింటిని కూడా నలుగురు దివ్యాంగులు తయారు చేస్తూ ఉంటారు.వారికి ఈ వస్తువుల తయారీ మరియు అమ్మడం ఇబ్బందిగా మారింది.ఈ వస్తువుల వద్ద ఒక ఉద్యోగిని ఏర్పాటు చేయడం వారికి ఆర్థిక భారం అయ్యింది.దాంతో ఏదైతే అదే అయ్యింది అనుకుని వారు షాప్‌ కీపర్‌ లేకుండానే షాప్‌ను ఏర్పాట్లు చేయడం జరిగింది.

ఈ షాప్‌ను పక్క షాప్‌ వ్యక్తి ఉదయం 10 గంటల సమయంలో తీస్తాడు.ఆయన షాప్‌ మూసే సమయంలోనే అంటే రాత్రి సమయంలో ఈ షాప్‌ను కూడా మూసేస్తాడు.షాప్‌కు వచ్చిన వారికి అర్థం అయ్యేలా ఈ షాప్‌లో కీపర్స్‌ ఎవరు లేరు, మీకు కావాల్సిన వస్తువులు మీరు తీసుకుని పక్కన ఉన్న డబ్బాలో సరిపడ డబ్బులు వేయండి అంటూ రాసి పెట్టి ఉంటుంది.నిజాయితీగా ఈ షాప్‌కు వచ్చిన వారు ప్రతి ఒక్కరు కూడా తీసుకున్న సమానుకు సరిపడా డబ్బులు డబ్బాలో వేసి వెళ్తూ ఉంటారు.

షాప్‌లో రెండు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది.ఆ సీసీ కెమెరాలతో అప్పుడప్పుడు వారు షాప్‌ను మానిటరింగ్‌ చేసుకోవడం జరుగుతుంది.

దివ్యాంగులు ఏర్పాటు చేసిన షాపు అంటూ స్థానికులందరికి తెలియడంతో వారిని ప్రోత్సహించేందుకు తమకు అవసరం ఉన్నా లేకున్నా వస్తువులు కొనుగోలు చేస్తూ వెళ్తున్నారు.కొందరు తాము తీసుకు వెళ్లిన వస్తువు ధర కంటే ఎక్కువగానే డబ్బాలో వేస్తూ ఉంటారు.మరి కొందరు రూపాయి, రెండు రూపాయలు తక్కువగా వేయడం జరుగుతుందని నిర్వాహకులు అంటున్నారు.మొత్తానికి రోజుకు వెయ్యి, నుండి పదిహేను వందల వరకు లాభం వస్తుందని నిర్వాహకులు అంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube