ఎస్.బి.ఐ ఖాతాలు హ్యాక్ అయ్యాయా ..? డేటా కు రక్షణ కరువయ్యిందా ...?

ఇప్పటివరకు మనం సోషల్ మీడియా ఖాతాలు లీక్ అవ్వడం.హ్యాకింగ్ బారిన పడడం , ఇలాంటివెన్నో చూసాం.అయితే… తాజాగా… అత్యంత విశ్వసనీయమైన సేవలు అందిస్తూ… బ్యాంకింగ్ రంగంలో రారాజుగా ఉన్న స్టేట్ బ్యాంకు అకౌంట్ల డేటా లీక్ అయ్యింది అనే వార్త సంచలనంగా మారింది.ఈ మేరకు టెక్ క్రంచ్ ఒక సంచలన కథనాన్ని ప్రచురించింది.

 Sbi Accounts Are Hacked1-TeluguStop.com

ఖాతాదారుల అకౌంట్ల వివరాలను హ్యాకర్లు సులువుగా తెలుసుకోవచ్చని, ఇప్పటికే లక్షలాది కస్టమర్ల ఫోన్ నెంబర్లు, బ్యాంక్ బ్యాలెన్స్, లావాదేవీలు, తదితర వివరాలు లీకయ్యాయని ప్రకటించింది.దీంతో ఎస్‌బీఐ కస్టమర్లలో ఆందోళన పెరిగింది.

మిస్డ్ కాల్ ద్వారా బ్యాంకింగ్ ప్రాథమిక సమాచారాన్ని తెలుసుకునే సదుపాయమే ’ఎస్‌బీఐ క్విక్’.ముంబైలోని సర్వర్ డేటా సెంటర్‌కు పాస్‌వర్డ్ ప్రొటెక్షన్ లేదని, తద్వారా హ్యాకర్లు ఎవరైనా చాలా సులువుగా లక్షలాది మంది కస్టమర్ల డేటాను యాక్సెస్ చేయొచ్చని టెక్ క్రంచ్ పేర్కొంది.

ఈ కధనం తరువాత దేశవ్యాప్తంగా ఎస్‌బీఐ కి ఉన్న సుమారు 42 కోట్లకు పైగా ఖాతాలకు సంబంధించిన డేటా భద్రతపై ఆందోళన వ్యక్తమవుతోంది.స్మార్ట్‌ఫోన్‌లు ఉపయోగించని కస్టమర్లు ఎస్‌బీఐ క్విక్ ద్వారా కస్టమర్లు టెక్స్‌స్ట్ మెసేజ్‌లతో వివరాలను తెలుసుకునే సదుపాయం.ఎస్‌బీఐ సూచించిన కీవర్డ్స్ ఆధారంగా రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ నుంచి ఈ సమాచారాన్ని ఖాతాదారులు తెలుసుకోవచ్చు.ముఖ్యంగా బ్యాలెన్స్ ఎంక్వైరీ, చివరి ఐదు లావాదేవీలు, ఏటీఎం కార్డు బ్లాక్ చేయడం, గృహ, వాహన రుణాలకు సంబంధించిన సమాచారం పొందొచ్చు.

ఇలా ఎస్‌బీఐ క్విక్‌కు రోజూ మెసేజ్‌లు బట్వాడా అవుతాయనీ, అయితే పాస్‌వర్డ్ లేని డేటాబేస్‌కు సంబంధించిన సమాచారాన్ని హ్యాకర్లు సులువుగా తెలుసుకోవచ్చని చెబుతోంది.

చెప్పడానికి సెక్యూరిటీ ఏజెన్సీ ఇటీవల జరిపిన పరిశోధనలో ఈ విషయాన్ని గుర్తించినట్టు వివరించింది.ఈ నేపథ్యంలోనే ఒక్క సోమవారం రోజే ఇలాంటి దాదాపు 30లక్షల నకిలీ మెసేజ్‌లు ఎస్‌బీఐ కస్టమర్లకు అందాయని టెక్ క్రంచ్ ఆరోపించింది.అయితే దీనిపై ఎస్ బీ ఐ ట్విటర్ ద్వారా స్పందించింది.

అత్యున్నత విలువలతో సేవలందిస్తున్న ఎస్ బీ ఐ వినియోగదారుల భద్రతకు పూర్తిగా కట్టుబడి ఉందని పేర్కొంది.దీనిపై విచారణ జరుపుతున్నట్టు ట్వీట్ చేసింది.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube