బాలయ్య ప్రకటన కోసం ఎదురు చూస్తున్న వర్మ... బాలయ్యకు రక్త కన్నీరు

నందమూరి తారక రామారావు బయోపిక్‌ ‘ఎన్టీఆర్‌ కథానాయకుడు’ తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చి పర్వాలేదు అనిపించింది.కాని కలెక్షన్స్‌ మాత్రం డిజాస్టర్‌ సినిమాలకు వచ్చే మాదిరిగా వచ్చాయి.

 Rgv Looking For Balakrishna Ntr Mahanayakudu For Laxmis Ntr-TeluguStop.com

ఇక ఎన్టీఆర్‌ మహానాయకుడు సినిమా విడుదలకు సిద్దం అవుతోంది.ఎన్టీఆర్‌ మహానాయకుడు సినిమాను మొదట ఫిబ్రవరి 8న అనుకున్నారు.

కాని ఇప్పుడు మహానాయకుడు సినిమా విడుదల తేదీ విషయంలో క్లారిటీ లేదు.కథానాయకుడు ఫలితంను ప్రేక్షకులు మర్చి పోయిన తర్వాత మహానాయకుడు సినిమా విడుదల చేయాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.

ఇదే సమయంలో మహానాయకుడు కోసం వర్మ కూడా ఎదురు చూస్తున్నట్లుగా తెలుస్తోంది.

వర్మ ప్రస్తుతం ఎన్టీఆర్‌ సెమీ బయోపిక్‌ లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ను తెరకెక్కిస్తున్న విషయం తెల్సిందే.ఎన్టీఆర్‌ కుటుంబ సభ్యులు లక్ష్మీ పార్వతిని ఎలా టార్గెట్‌ చేశారు, ఎన్టీఆర్‌ను ఎలా వెన్ను పోటు పొడిచారనే విషయాలను ఈ చిత్రంలో చూపిస్తానంటూ వర్మ చెబుతున్నాడు.ఈ చిత్రాన్ని ఎన్టీఆర్‌ మహానాయకుడు వచ్చిన సమయంలోనే విడుదల చేయాలనే గట్టి పట్టుదలతో వర్మ ఉన్నాడు.

వర్మ కూడా లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ విడుదల తేదీని జరుపుతూ వస్తున్నాడు.మొదట అనుకున్న ప్రకారం ఫిబ్రవరి మొదటి వారంలోనే ఉండాలి.కాని మహానాయకుడు వాయిదా కారణంగా తన సినిమాను వాయిదాలు వేస్తున్నాడు.

బాలకృష్ణ ‘ఎన్టీఆర్‌ కథానాయకుడు’ మూవీని టార్గెట్‌ చేసి వర్మ పలు సంచలన ట్వీట్స్‌ చేయడంతో పాటు, తన సినిమాలకు సంబంధించిన పాటలు, వీడియోలను విడుదల చేసి ఆ సినిమాపై క్రేజ్‌ తగ్గించాడు.ఇప్పుడు మహానాయకుడు విషయంలో కూడా వర్మ అలాగే ప్రవర్తిస్తున్నాడు.మరీ బాలకృష్ణను వర్మ ఇంతగా టార్గెట్‌ ఎందుకు చేశాడో అర్థం కావడం లేదు.

స్వయంగా ఈ చిత్రాన్ని నిర్మించిన బాలకృష్ణకు వర్మ చేస్తున్న పనితో రక్తకన్నీరు మిగిలే పరిస్థితి ఏర్పడింది.మహానాయకుడుకు పోటీగా లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ వస్తే మాత్రం బాలయ్య మూవీకి కలెక్షన్స్‌ నిల్‌ అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube