మీకో రాజ్యాంగం మాకో రాజ్యాంగమా ...? బాబు ఘాటు లేఖ రాసిన ముద్రగడ

ఏపీలో మరో సారి కాపు ఉద్యమాన్ని రగిల్చేందుకు ముద్రగడ పద్మనాభం ప్రయత్నిస్తున్నాడు.దీనిలో భాగంగానే… ఈ నెలాఖరున తూర్పు గోదావరి జిల్లా కత్తిపూడిలో నిర్వహించతలపెట్టిన చలో కత్తిపూడి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలనీ చూస్తున్నాడు.అయితే… ఆ కార్యక్రమానికి అనుమతి తీసుకోలేదని పోలీసులు ప్రకటించడంతో ముద్రగడ అసంతృప్తి వ్యక్తం చేశారు.దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఒక లేఖ రాశారు.

 Mudragada Padmanabam Write A Letter To Chandrababu-TeluguStop.com

అందులో అనేక ప్రశ్నలను సందించారు.

నవనిర్మాణ దీక్షలు అంటూ విజయవాడ లో నడిరోడ్డు మీద ముఖ్యమంత్రిగా ఉండి సబలు పెట్టుకోవచ్చా? అప్పుడు ట్రాపిక్ కు ఎన్ని గంటలు ఇబ్బంది వచ్చినా,ప్రజలు నానా పాట్లు పడినా ఫర్వాలేదా అని ముద్రగడ ప్రశ్నించారు.‘గత మూడేళ్లుగా తమ జాతి కోసం జరిగిన ఉద‍్యమం గురించి ఈనెల 31వ తేదీన కత్తిపూడిలో చిన్న సమావేశం ఏర్పాటు చేసుకోవడానికి మేము నిర్ణయించుకున్నాం.మరి ఆ కలయిక గురించి మీరు ఎందుకు ఉలిక్కిపడుతున్నారో అర్థం కావడం లేదు.

అన్ని పార్టీల పెద్ద నాయకులు నిత్యం రోడ్డుకు అడ్డంగా ఎన్నో సభలు పెట్టుకుంటున్నారు.

మీరు కూడా ధర్మపోరాట దీక్షల వంకతో విజయవాడ లాంటి అతి పెద్దపట్టణం నాలుగు రోడ్ల జంక్షన్‌లో ట్రాఫిక్‌ మళ్లించి రోడ్డుకు అడ్డంగా కుర్చీలు వేసి ఉపన్యాసాలు చెప్పారు.అలాగే తొందరలో మీరు ఢిల్లీలో కూడా దీక్ష చేస్తానని చెబుతున్నారే.మీరు బస్సు యాత్ర పేరుతో ఏ జిల్లాకైనా బయలుదేరినప్పుడు ట్రాఫిక్‌ను గంటల తరబడి నిలిపివేస్తున్నారే.

మీ అందరికీ ఒక రాజ్యాంగం.మాకు మరొక రాజ్యాంగమా ముఖ్యమంత్రి గారూ’ అని ముద్రగడ తెలిపారు.

కాగా తనను ఏ విదంగా బూతులు తిట్టిన విషయాలను కూడా ఆ లేఖలోముద్రగడ ప్రస్తావించారు.కాగా కత్తిపూడి సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్లు ఆయన తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube