బెడ్‌ కింద శవం ఉందనే విషయం తెలియక 5 రోజులు... తెలిసిన తర్వాత సిగ్గుతో తల దించుకున్నాడు

ఇంట్లో ఏదైనా ఎలుక చచ్చినా లేదంటే ఏదైనా చెత్త మురిగినా కూడా భరించలేనంత వాసున వస్తుంది.ఆ వాసనతో ఇంట్లో ఉండాలనిపించదు.

 Body Of Pregnant Woman Found In Bed Storage In Bihar-TeluguStop.com

కనీసం ఇంట్లో మంచి నీళ్లు తాగుతూ ఉన్నా కూడా ఆ వాసన దారుణంగా వచ్చి వాంతులు వచ్చేంత దారుణంగా ఉంటుంది.చిన్న ఎలుక చనిపోయి ఉంటేనే మనకు దారుణమైన వాసున వస్తుంది.

అదే ఏకంగా ఒక మనిషి చనిపోయి ఉంటే ఎంతటి దారుణమైన వాసున రావాలి చెప్పండి.కాని ఆ వ్యక్తి మాత్రం చనిపోయిన వ్యక్తిని ఇంట్లోనే ఉన్నా, ఆ వాసన వస్తున్నా కూడా ఏదోలే అనుకుని అయిదు రోజులు అలాగే ఉన్నాడు.

ఆ తర్వాత విషయం తెలిసి కళ్లు తిరిగి పడిపోయినంత పనైంది అతడికి.?

పూర్తి వివరాల్లోకి వెళ్తే… బీహార్‌లోని గయకి చెందిన దినేష్‌ కుమార్‌కు ఒక హోటల్‌ ఉంది.ఆ హోటల్‌లో రాజేష్‌ పని చేస్తూ ఉంటాడు.రాజేష్‌ తన భార్యతో కలిసి దినేష్‌ ఇంట్లోనే ఒక పోర్షన్‌లో ఉండేవాడు.దినేష్‌కు రాజేష్‌ చాలా నమ్మకస్తుడు అయ్యాడు.దినేష్‌ ఒకరోజు పనిమీద ఊరు వెళ్తు ఇంటి తాళం రాజేష్‌కు ఇచ్చి వెళ్లాడు.

వారం రోజుల తర్వాత ఇంటికి వచ్చిన దినేష్‌ యదాతదంగా తన బెడ్‌ రూమ్ లో పడుకుంటూ ఉన్నాడు.రోజు ఏదో వాసన వస్తున్నా కూడా దినేష్‌ పట్టించుకోలేదు.

అయిదు రోజుల తర్వాత మరింతగా వాసున వచ్చింది.

తట్టుకోలేని వాసన వస్తుండటంతో ఏంటా అని అటు ఇటు చూశాడు.బెడ్‌ కింద చూసేప్పటికి రాజేష్‌ భార్య మృత దేహం ఉంది.రాజేష్‌ హత్య చేసి మృతదేహంను తన బెడ్‌ కింద పెట్టి ఉంటాడనే అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

కేసు నమోదు చేసిన పోలీసులు ఎంక్వౌరీ చేస్తున్నారు.కుల్లిన శవంను పోస్ట్‌ మార్టం చేసి, ఆమె తల్లికి అప్పగించారు.

అయిదు రోజుల పాటు శవం పై నుడి పడుకున్నందుకు గాను దినేష్‌ గజగజ వణికి పోతున్నాడు.ఆ వాసన తెలియకుండా ఎలా ఉన్నావంటూ నలుగురు అంటూ ఉంటే సిగ్గుతో తల వంచుకున్నాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube