ఆ ఓటర్లే లక్ష్యంగా ... టీడీపీ బాటలో వైసీపీ !

రాజకీయయ పార్టీలకు ఎన్నికల టెన్షన్ అంతా ఇంతా కాదు.ఎన్నికల్లో సమర్థులైన అభ్యర్థులను ఎంచుకోవడం… పార్టీలో పరిస్థితులన్నీ చక్కదిద్దడం… ప్రత్యర్థి పార్టీల ఎత్తులుకి పై ఎత్తులు వేయడం… ఇలా ఒకటా రెండా అనేక అనేక సమస్యలను ఎదుర్కుంటూ… ప్రజల మద్దతు పొందాలి.అంతిమంగా… విజయం కోసం అన్ని పార్టీలు తమ తమ వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నాయి.ముఖ్యంగా … అధికారం కోసం టీడీపీ, వైసీపీలు నువ్వా నేనా అన్నట్లు తలపడుతున్నాయి.

 Ys Jagan Following Chandrababu Naidu For The Particular Vote Bank People-TeluguStop.com

ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్ది ఇరు పార్టీలు ఆయా సామజిక వర్గాల ఓట్లపై దృష్టిపెట్టాయి.ముఖ్యంగా మెజార్టీ స్థాయిలో ఓటర్లుగా ఉన్న బీసీలను అకర్శించేందుకు పోటీ పడుతున్నాయి.

మొదటి నుంచి టీడీపీకి బీసీ ఓటు బ్యాంకు అనుకూలంగానే ఉండేది.కాని రాను రాను బీసీ ఓటుబ్యాంకు దూరం అయ్యింది.అయితే ప్రస్తుతం ఎన్నికల సీజన్ కావడంతో బీసీ ఓటర్లను ఆకర్షించేందుకు టీడీపీ పెద్ద ఎత్తుగడలు వేస్తోంది.తాజాగా….రాజమండ్రిలో టీడీపీ ఆధ్వర్యంలో ఆదివారం జయహో బీసీ సదస్సు నిర్వహించారు.బీసీలకు న్యాయం చేసిన పార్టీ టీడీపీయేనని ఆయన గుర్తు చేశారు.బీసీలకు వరాల జల్లులు కురిపించారు.ఈ వేదికపై నుండి వైఎస్‌ఆర్‌పై, వైసీపీపై చంద్రబాబునాయుడు విమర్శలు పెద్ద ఎత్తున చేశారు.

ఈ సభ అనుకున్నంత స్థాయిలో విజయవంతం అవ్వడంతో….టీడీపీ జోష్ మీద ఉంది.ఇక ఈ విషయంలో టీడీపీకి మైలేజ్ రావడంతో… వైసీపీలో ఆందోళన పెరిగింది.అందుకే… బీసీ సభకు కౌంటర్‌గా వైసీపీ కూడా బీసీ గర్జన నిర్వహించాలని భావిస్తోంది.

దీనిలో భాగంగా జగన్ తన కార్యాలయంలో నాయకులతో భేటీ అయ్యారు.ఈ ఏడాది ఫిబ్రవరి 19వ తేదీన ఏలూరులో ఈ సభను ఏర్పాటు చేయాలని ఆ పార్టీ భావిస్తోంది.ఈ మేరకు జగన్‌తో సోమవారం నాడు బీసీ నేతలు పార్టీ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు.రాష్ట్రంలోని 13 జిల్లాలో బీసీ సమస్యలపై అధ్యయనం చేసిన పార్టీ నేతల బృందం సోమవారం జగన్‌తో లోటస్‌పాండ్‌లో సమావేశం నిర్వహించారు.

ఇప్పటికే వైసీపీ ప్రకటించిన నవరత్నాల్లో బీసీలకు మరిన్ని పథకాలను ప్రకటించే ఆలోచనలో ఉంది.ఆందుకే టీడీపీ నిర్వహించిన బీసీ సభకు ధీటుగా భారీ సభను ఏర్పాటు చేయాలనీ చూస్తున్నారు.

అయితే ఈ సభను ఎప్పుడు ఎక్కడ నిర్వహించాలి అనే విషయమై పార్టీ నేతలతో జగన్ చర్చిస్తున్నారు.తొందర్లోనే దీనిపై ఒక క్లారిటీ ఇచ్చేందుకు వైసీపీ సిద్ధం అవుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube