వారికి కేసీఆర్ శుభవార్త చెప్పబోతున్నాడా ...? ఆ టైం వచ్చేసిందా ...?

తెలంగాణాలో టీఆర్ఎస్ పార్టీకి ఎదురే లేదు అన్నట్టుగా తెలంగాణ లో ఎన్నికల ఫలితాలను సాధించింది.కేసీఆర్ కూడా తన రాజకీయ అస్త్రాలతో…ప్రత్యర్థి పార్టీలను ఆ విధంగానే ఎదుర్కుంటూ….

 Kcr To Give Importance For That Candidates In Telangana Cabinet-TeluguStop.com

ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగాడు.అయితే ఆయన ప్రమాణ స్వీకారం చేసి దగ్గర దగ్గర రెండు నెలలు కావోస్తున్నా ఇప్పటి వరకూ మంత్రి వర్గం ఏర్పాటు చేయలేదు.

అయితే ఫిబ్రవరి తొలివారంలోగా క్యాబినెట్ విస్తరణ ఉంటుందని గవర్నర్‌కు కేసీఆర్ చెప్పినట్టు టీఆర్ఎస్ పార్టీలో చర్చలు నడుస్తున్నాయి.అయితే ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రివర్గ విస్తరణలో అనుభవానికి పెద్దపీట వేయాలని చూస్తున్నట్టు తెలుస్తోంది.

అంతే కాకుండా… మంత్రివర్గ విస్తరణలో ఎక్కువసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వారికి ఈ సారి ప్రాధాన్యం ఇవ్వాలని కేసీఆర్ భావిస్తున్నాడట.వీరితో పాటు తొలిసారి ఎమ్మెల్యే అయిన వారిలో ఒకరిద్దరికి మాత్రమే అవకాశం ఉన్నట్లు సమాచారం అందుతోంది.ఇందుకు అనుగుణంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ తన నివాసంలో కసరత్తు చేసినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.ఈ ప్రకారం కేసీఆర్ పదవులు ఇచ్చే నాయకుల పేర్లను కొన్ని పరిశీలిస్తే… హరీష్ రావుకి పదవి దక్కే అవకాశం ఎలాగూ ఉంది.

అయితే కేటీఆర్ కి మాత్రం ఈ సారి మంత్రి పదవి దక్కే అవకాశం లేనట్టుగా కనిపిస్తోంది.నిజామాబాద్‌ నుంచి ప్రశాంత్‌రెడ్డి లేదా బాజిరెడ్డి గోవర్ధన్‌, ఆదిలాబాద్‌ నుంచి రేఖానాయక్‌ పేరు వినిపిస్తోంది.

కాకపోతే… మెదక్‌ నుంచి పద్మా దేవేందర్‌రెడ్డికి అవకాశం దక్కితే రేఖానాయక్‌కు మంత్రి పదవి దక్కే అవకాశం లేనట్టుగానే వార్తలు వినిపిస్తున్నాయి.ఈ సందర్భంలో ఆదిలాబాద్‌ నుంచి ఇంద్రకరణ్‌రెడ్డి, జోగు రామన్నలలో ఎవరో ఒకరికి అవకాశం దక్కే సూచనలు ఉన్నాయి.ఇక మహబూబ్‌నగర్‌ నుంచి శ్రీనివాస్‌గౌడ్‌, లక్ష్మారెడ్డి లేదా నిరంజన్‌రెడ్డి, నల్గొండ నుంచి జగదీశ్‌రెడ్డి, గుత్తా సుఖేందర్‌రెడ్డి, నోముల నర్సింహయ్య, కరీంనగర్‌ నుంచి ఈటల రాజేందర్‌, కొప్పుల ఈశ్వర్‌, ఖమ్మం నుంచి పువ్వాడ అజయ్‌, రంగారెడ్డి నుంచి నరేందర్‌రెడ్డి, హైదరాబాద్‌ నగరం నుంచి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, వరంగల్‌ నుంచి మాజీ మంత్రి కడియం శ్రీహరి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, రెడ్యానాయక్‌, శాసనమండలి విప్‌ పల్లా రాజేశ్వర్‌రెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube