'మిస్టర్‌ మజ్ను' బడ్జెట్‌ ఎంత? వస్తున్న కలెక్షన్స్‌ ఎంత? వారికి రక్తకన్నీరే!

అక్కినేని అఖిల్‌ హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన ‘మిస్టర్‌ మజ్ను’ చిత్రం తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.భారీ అంచనాల నడుమ రూపొందిన ఈ చిత్రంతో అఖిల్‌ ఖచ్చితంగా హిట్‌ కొడతాడని అంతా భావించారు.

 Mr Majnu Movie Budget And Total Collections-TeluguStop.com

సక్సెస్‌ నిర్మాతగా పేరు దక్కించుకున్న బివిఎస్‌ఎన్‌ ప్రసాద్‌ ఈ చిత్రాన్ని నిర్మించాడు.అంచనాలకు తగ్గట్లుగా ఈ చిత్రం లేదు.

తొలి ప్రేమ చిత్రంతో సక్సెస్‌ కొట్టిన దర్శకుడు వెంకీ అట్లూరి ఈ చిత్రంతో బొక్క బోర్లా పడ్డాడు.ఏమాత్రం ఆకట్టుకోకుండా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడంటూ విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

అఖిల్‌ మొదటి రెండు సినిమాలు ఫ్లాప్‌ అయిన నేపథ్యంలో ఈ చిత్రాన్ని కాస్త తక్కువ బడ్జెట్‌తో అంటే 20 కోట్లకు కాస్త అటు ఇటు బడ్జెట్‌తో నిర్మించారు.సినిమాపై అంచనాలు భారీగా ఉన్న నేపథ్యంలో విడుదలకు ముందు డిస్ట్రిబ్యూటర్లు ఈ చిత్రాన్ని అన్ని ఏరియాలకు కలిపి 22.5 కోట్లకు కొనుగోలు చేశారు.నిర్మాతకు విడుదలకు ముందే రెండున్న కోట్ల రూపాయలు లాభం దక్కింది.

అయితే సినిమా విడుదలైన తర్వాత మాత్రం కలెక్షన్స్‌ దారుణంగా వస్తున్నాయి.

విడుదలైన మొదటి రోజు 4.3 కోట్ల రూపాయల షేర్‌ దక్కింది.ఆ తర్వాత రోజు నుండే కలెక్షన్స్‌ తగ్గుముఖం పట్టాయి.

వీకెండ్‌లో ఈ చిత్రం మరో అయిదు కోట్లను రాబట్టింది.మొత్తంగా పది కోట్ల షేర్‌ను ఈ చిత్రం అటు ఇటుగా రాబట్టిందని, మరో రెండు మూడు కోట్లకు ఎక్కువగా ఈ చిత్రం దక్కించుకోవడం కష్టమే అంటున్నారు.

ఎంత ప్రయత్నించినా కూడా ఈ చిత్రం 15 కోట్లకు మించి షేర్‌ దక్కించుకోలేక పోవచ్చు అనేది ట్రేడ్‌ వర్గాల విశ్లేషణ.డిస్ట్రిబ్యూటర్లు ఈ చిత్రం వల్ల దాదాపుగా 10 కోట్లు లాస్‌ అయ్యే అవకాశం ఉంది.

ఈ చిత్రంతో అయినా సక్సెస్‌ అయితే స్టార్‌ హీరోల సరసన చేరాలని భావించిన అఖిల్‌కు ఈచిత్రం కూడా నిరాశనే మిగిల్చింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube