జబర్దస్త్‌ ప్రేక్షకులకు గుడ్‌ న్యూస్‌... ఆశ్చర్యంగా అనసూయ చెల్లితో రీ ఎంట్రీ ఇచ్చిన ఆది

జబర్దస్త్‌ షో నిర్వరామంగా, విజయవంతంగా దాదాపు ఏడేళ్లుగా కొనసాగుతూ వస్తున్న విషయం తెల్సిందే.2012లో ప్రారంభం అయిన ఈ షోలో అందరికంటే అత్యంత ఆధరణ పొందిన కమెడియన్‌ ఆది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.జబర్దస్త్‌ షోను దాదాపు రెండేళ్ల పాటు మొత్తం తానై నడిపించిన వ్యక్తి ఆది.హైపర్‌ ఆదిగా తనదైన శైలిలో పంచ్‌లు వేస్తూ జబర్దస్త్‌కు అద్బుతమైన టీఆర్పీరేటింగ్‌ దక్కేలా చేసిన ఆది, యూట్యూబ్‌లో కూడా సంచలనంగా నిలిచాడు.ఆయన చేసిన ప్రతి స్కిట్‌ కూడా మిలియన్స్‌ వ్యూస్‌ ను దక్కించుకుంటూ వచ్చాయి.

 Jabardasth Hyper Aadi Entry With Anchor Anasuya Sister-TeluguStop.com

ప్రేక్షకుల ఆది కామెడీని ఎంజాయ్‌ చేస్తున్న సమయంలో ఆశ్చర్యకరంగా ఆది జబర్దస్త్‌ నుండి కనిపించకుండా పోయాడు.

హైపర్‌ ఆది రైజింగ్‌ రాజు టీం కాస్త ఓన్లీ రైజింగ్‌ రాజు టీంగా మారిపోయింది.దాంతో ఆది ఇక జబర్దస్త్‌లో కనిపించక పోవచ్చు అంటూ అంతా కూడా ఆవేదన వ్యక్తం చేశారు.

సినిమాల్లో వరుసగా ఆఫర్లు వస్తున్న ఆది ఇక సెలవు అంటూ జబర్దస్త్‌కు గుడ్‌ బై చెప్పాడని అంతా భావించారు.కాని అనూహ్యంగా ఆది రెండు నెలల తర్వాత రీ ఎంట్రీ ఇచ్చాడు.

వచ్చే వారం ప్రసారం కాబోతున్న జబర్దస్త్‌ షోలో ఆది కనిపించబోతున్నాడు.అందుకు సంబంధించిన ప్రమోను మొన్న విడుదల చేశారు.ప్రమోలో ఆది రీ ఎంట్రీ అదిరి పోయింది.వచ్చే వారం స్కిట్‌ కొట్టేది ఆదే అంటూ తేలిపోయింది.ఆశ్చర్యకరంగా వచ్చే వారం స్కిట్‌లో రోజాతో డాన్స్‌ చేయించడంతో పాటు, అనసూయ చెల్లి వైష్ణవిని తీసుకు రావడం ఆశ్చర్యకరంగా ఉంది.అచ్చు అనసూయలాగే ఉన్న వైష్ణవిని ఆది వెంట పెట్టుకు వచ్చి అందరిని సర్‌ప్రైజ్‌ చేశాడు.

మొత్తానికి ఆది రీ ఎంట్రీతో జబర్దస్త్‌ హడావుడి మళ్లీ మొదలైంది.యూట్యూబ్‌లో 24వ తారీకు పోస్ట్‌ అయిన ఆది జబర్దస్త్‌ ప్రోమో దాదాపుగా మూడు మిలియన్‌ల వ్యూస్‌ను సొంతం చేసుకుని ఆది సత్తా చాటింది.

ఆది రాకతో మళ్లీ హైపర్‌ ఆది టీం రైజింగ్‌లోకి రావడం ఖాయం అంటూ ప్రేక్షకులు నమ్మకంగా చెబుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube