ఫోన్‌ బ్యాటరీ ఎక్కువ కాలం మన్నికగా ఉండాలంటే ఈ చిట్కాలు పాటించండి.. ప్రయోగం చేసి నిరూపించబడింది

ఒకప్పుడు నోకియా బేసిక్‌ ఫోన్‌ లు ఉన్న సమయంలో ఒక్క రోజు చార్జింగ్‌ పెడితే వారం రోజులు వచ్చేది.ఒక సారి చార్జింగ్‌ పెట్టి చార్జర్‌ పక్కన పెడితే దాన్ని మళ్లీ చార్జింగ్‌ పెట్టడానికి వెదుక్కోవాల్సి వచ్చేంది.

 Follow These Tips To Extend Lifespan Of Your Phone Battery-TeluguStop.com

ఎందుకంటే అన్ని రోజులు దాన్ని వాడకుండా ఉండేప్పటికి అది ఎటో మూలకు పడిపోయేది.నోకియా 1100 మొబైల్‌ ఫోన్‌లు వాడిన వారికి ఈ విషయం గుర్తుండే ఉంటుంది.

కాని ప్రస్తుత పరిస్థితి పూర్తి విరుద్దం.ఎంత ఖరీదైనా ఫోన్‌ అయినా కూడా ఖచ్చితంగా రోజుకు రెండు సార్లు చార్జ్‌ చేసుకోవాల్సి ఉంటుంది.

ఇక కొందరైతే ఎప్పుడు కూడా పవర్‌ బ్యాంక్‌ను కనెక్ట్‌ చేసి ఉంచుతూనే ఉంటారు.ఎంత ఖరీదైన ఫోన్‌ కొనుగోలు చేసినా కూడా దాని బ్యాటరీ లైఫ్‌ మాత్రం చాలా తక్కువగా ఉంటుంది.

ముఖ్యంగా స్మార్ట్‌ ఫోన్‌లు చాలా తక్కువ చార్జింగ్‌ కలిగి ఉంటున్నాయి.

డేటా యూజ్‌ చేయడం, గేమ్స్‌ ఆడటం, వీడియోలు చూడటం వంటివి చేస్తే బ్యాటరీ అత్యంత స్పీడ్‌గా డిచ్చార్ట్‌ అవుతుంది.

ఎక్కువ సార్లు బ్యాటరీ డిచార్జ్‌ అవుతే బ్యాటరీ లైఫ్‌ కూడా చాలా తక్కువ టైం కొనసాగుతుంది.మొబైల్‌ కొన్ని కొత్తలో రోజంతా చార్జింగ్‌ వస్తే, కొన్ని రోజులకే చార్జింగ్‌ ఉంటం లేదనే ఫిర్యాదు చేస్తూ ఉంటారు.

ఇలా చార్జింగ్‌ వెంటనే దిగి పోవడానికి ప్రధాన కారణం మనం మొబైల్‌ను వినియోగించే విధానమే.కాస్త జాగ్రత్తగా వాడుకుంటే బ్యాటరీ లైఫ్‌ బాగానే ఉంటుంది.

బ్యాటరీని ఎలా జాగ్రత్తగా ఉంచుకోవాలో ఇప్పుడు చూద్దాం :


మొబైల్‌ చార్జింగ్‌ జీరో శాతానికి వచ్చే వరకు చూడకుండా 15కు పైగా ఉన్నప్పుడే చార్జింగ్‌ పెట్టాలి.బ్యాటరీ ఎక్కువ సార్లు డెడ్‌ స్టోరేజీకి వచ్చినట్లయితే బ్యాటరీ లైఫ్‌ తగ్గిపోతుంది.

బ్యాటరీ 100 శాతం అయిన తర్వాత కూడా చార్జింగ్‌ పెట్టి ఉంచడం మంచిది కాదు.కొందరు రాత్రి సమయంలో చార్జింగ్‌ పెడతారు.తెల్లవారు అలాగే ఉంచుతారు.మద్యరాత్రికే బ్యాటరీ 100 శాతం అవుతుంది.

అయినా అలాగే ఉంచడం వల్ల బ్యాటరీ లైఫ్‌ తగ్గుతుంది.

మొబైల్ లో చెత్త చెత్త యాప్స్ ఉంటే తొలగించండి.

రెగ్యులర్ గా యూజ్ చేస్తామనుకుంటేనే వాటిని ఉంచుకోండి.

బ్యాటరీ పూర్తిగా డెడ్‌ అయితే ఒకేసారి 100 శాతం అయ్యే వరకు చార్జింగ్‌ పెట్టకండి.50 నుండి 60 శాతం వచ్చే వరకు ఉంచి తొలగించండి.మరో గంట తర్వాత మళ్లీ చార్జ్‌ చేసుకోండి.

చివరిగా ఫోన్‌ను ఎక్కువగా చలి ప్రదేశంలో కాని, వేడి ప్రదేశంలో కాని ఉంచినా కూడా బ్యాటరీ లైఫ్‌ తగ్గుతుంది.

ఈ చిన్న చిట్కాలను ఫాలో అయితే మీ స్మార్ట్‌ ఫోన్‌ బ్యాటరీ ఎక్కువ కాలం మన్నుతుంది.

ప్రతి స్మార్ట్ ఫోన్ యూజర్ కు యూజ్ అయ్యే ఈ విషయాన్ని షేర్ చేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube