కాపు 'వల' విసురుతున్న బాబు ! వర్కవుట్ అవుతుందా ...?

ఎప్పుడు ఎక్కడ ఎవరిని ఎలా బుట్టలో వేసుకోవాలో రాజకీయ నాయకులకు తెలిసినంతగా ఎవరికీ తెలియదు.ఏదో ఒక రకంగా ఓటర్లను బుట్టలో వేసుకునేందుకు నాయకులు ప్రయత్నిస్తూనే ఉంటారు.

 Chandrababu Naidu Wants To Kapu Votes For His Win-TeluguStop.com

ఇప్పడు ఏపీ లో రాజకీయ పార్టీలు కూడా ఇదే పనిలో పడ్డాయి.ఎన్నికలకు మరో మూడు నెలలు మాత్రమే సమయం ఉండడంతో… కొత్త కొత్త పధకాల రూపకల్పన చేస్తూ… హామీల వర్షం కురిపించే పనిలో పడ్డారు.

ఇప్పటికే చంద్రబాబు ఈ హామీలు ఇవ్వడమే కాదు వాటిని అమలు చేస్తూ… వేగంగా ముందుకు దూసుకువెళ్తున్నాడు.పక్క పార్టీల ఎన్నికల మేనిఫెస్టో లు కూడా కాపీ కొట్టి మరీ వాటిని అమలు చేస్తున్నాడు.

ఈ ముక్కోణపు పోటీలో గెలుపు తమ ఖాతాలో వేసుకునేందుకు చంద్రబాబు మరింతగా స్పీడ్ పెంచాడు.ఈ నేపథ్యంలోనే….కాపు సామజిక వర్గం ఓట్లను తమ ఖాతాలో వేసుకునేందుకు కొత్తరకమైన ఎత్తుగడ వేస్తున్నాడు.

అగ్రవర్ణాల పేదలకు నరేంద్ర మోడీ ప్రభుత్వం 10% రిజర్వేషన్ ఇస్తూ ఇటీవలే చట్టం చేసిన సంగతి తెలిసిందే.ఆ చట్టం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాలకు రిజర్వేషన్లు అమలు లో తమ రాష్ట్రాల అవసరాల మేరకు నిబంధనలు తయారుచేసుకునే అవకాశం కల్పించారు.ఇప్పుడు ఈ అవకాశాన్ని తమకు అనుకూలంగా మలుచుకునేందుకు బాబు ప్లాన్ వేస్తున్నాడు.

ఏ ప్లాన్ ప్రకారం ….ఏపీలో కాపులకు ఇచ్చిన 5% రిజర్వేషన్లను కల్పించేలా క్యాబినెట్ తీర్మానం చేసారు.

దీని ద్వారా అటు జగన్ పార్టీకి … పవన్ పార్టీకి ఒకేసారి చెక్ పెట్టి కాపు సామజిక వర్గం ఓట్లను గంపగుత్తగా కొట్టేయాలని చూస్తున్నాడు.

ఈ క్రమంలో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు ఇచ్చే 10 శాతం రిజర్వేషన్లలో 5 శాతం కాపులకు, మిగతా 5 శాతం ఇతర అన్ని అగ్రకులాల పేదలకు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు.

అయితే దీనివల్ల మిగతా అగ్రవర్ణాల పేదలలో వ్యతిరేకత వస్తుందా అనేది చూడాలి.అయితే ప్రభుత్వం మాత్రం కాపులు ఆంధ్రప్రదేశ్ జనాభాలో 15% శాతం వరకు ఉంటారని, అగ్రవర్ణాల జనాభాలో వారు దాదాపుగా 50% వరకు ఉంటారని కాబట్టి వారికి 5% రిజర్వేషన్లు ఇవ్వడం సరైనదే అనే ఆలోచనలో ఉంది.

కాపులకు రిజర్వేషన్లు ఇవ్వడం అనేది టీడీపీ 2014 ఎన్నికల మేనిఫెస్టో లో ఉంది.ఇప్పటికే వారికి 5% రిజర్వేషన్లు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపింది.అయితే కేంద్రం దానిని 50% కంటే ఎక్కువ రిజర్వేషన్లు ఉన్నాయనే పేరుతో పక్కన పెట్టింది.అయితే అగ్రవర్ణాల పేదలకు నరేంద్ర మోడీ ప్రభుత్వం 10% రిజర్వేషన్ ఇస్తూ 60% రిజర్వేషన్లు చేసింది.

దానికోసం రాజ్యాంగ సవరణ కూడా చేసింది.

అయితే రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నది చట్ట వ్యతిరేకమని కొందరి వాదన.

కోర్టులో ఇది నిలవజాలదని వారి అభిప్రాయం.రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఇది కోర్టులలో నిలుస్తుందని అభిప్రాయపడుతుంది.

ఒక వేళ రాష్ట్ర ప్రభుత్వం గనుక ఇది చెయ్యగలిగితే ఎన్నికల ముందు కాపులను ఆకట్టుకోవడంలో పెద్ద ముందడుగు వేసినట్టే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube