సేవ్ జాబ్స్ యూఎస్ఏ..వారి ఉద్యోగాలు ఊడినట్టే..??

అమెరికాలో హెచ్ -1 బీ వీసా ద్వారా ఉంటున్న ఎంతో మంది ఎన్నారైల జీవిత భాగస్వాముల ఉద్యోగాలు గాలిలో కలిసి పోనున్నాయి.వారి ఉద్యోగానికి అమెరికా “సేవ్ జాబ్స్ యూఎస్ఏ” అనే సంస్థ అడ్డు పడుతోంది.

 Save Jobs Usa Is No More H1b Visa Holders Partners-TeluguStop.com

అంతేకాదు అమెరికాలో ఉంది ఉద్యోగం చేయాలని భావిస్తూ ఎదురు చూస్తున్న మరికొంతమంది ఆశలపై కూడా సదరు సంస్థ నీళ్ళు పోసింది.

ఒబామా హయాంలో భారతీయ వృత్తి నిపుణుల జీవిత భాగస్వాములు ఉద్యోగం చేసుకునేందుకు వీలు కలిపించారు.అయితే ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ వలస దారులు కారణంగా ఉద్యోగం కోల్పయిన అమెరికన్ల తరుపున పోరాటం చేస్తున్న “సేవ్‌జాబ్స్‌ యూఎస్‌ఏ” అనే సంస్థ 2015లో కోర్టులో కేసు వేసింది.అయితే

ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్న ఈ కేసు పై విచారణ చేపట్టాలని నెల క్రితం యూఎస్‌ కోర్ట్‌ ఆఫ్‌ అప్పీల్స్‌ ఆదేశాలిచ్చింది.ఇందుకుగాను తమదైన వాదనలు వినిపించేందుకు వలస ఉద్యోగుల సమస్యలపై పోరాడుతున్న ‘ఇమిగ్రేషన్‌ వాయిస్‌’ అనే సంస్థకు కూడా అవకాశమిచ్చింది.అయితే ఒక వేళ వలసవాసులకి అనుకూలంగా కోర్టు తీర్పుని ఇచ్చినా సరే తమదైన కార్యాచరణ చేపట్టాలని ట్రంప్ భావిస్తున్నట్లుగా స్థానిక మీడియా తెలుపుతోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube