వందేళ్లు ఎలా బతకాలో ప్రయోగాలు చేసి కనిపెట్టిన శాస్త్రవేత్తలు.. అక్కడ నిరూపితం కూడా అయ్యింది

మనిషి ఎంత సంపాదించినా, ఎంతగా పేరు ప్రఖ్యాతలను ఘడించినా కూడా బతికి ఉన్నంత వరకే.ఆ తర్వాత ఆ డబ్బు ఇతరులకు చెందుతుంది, పేరు ప్రఖ్యాతలు కొన్ని రోజుల్లోనే కనుమరుగు అవుతాయి.

 Scientifically Proven Facts That How To Live Longer With The Food Habits-TeluguStop.com

మనిషి ఉన్నంత వరకే అతడికి విలువ.అందుకే ప్రతి మనిషి కూడా సాధ్యం అయినంత వరకు ఎక్కువ కాలం బతకాలని భావిస్తూ ఉంటాడు.

నాకు వంద ఏళ్లు ఆయుస్సు ఉంటే బాగుండు, నాకు అసలు మరణం లేకుండా ఉంటే బాగుండు అని ఎంతో మంది అనుకుంటూ ఉంటారు.నాకు వంద ఏళ్లు వచ్చినా ఇలాగే ఉండాలని అనుకునే వారు కూడా ఉంటారు.

ఆ దిశగా శాస్త్రవేత్తలు ఎన్నో ఏళ్లుగా ప్రయోగాలు చేస్తున్నారు.

మనిషి ఆయుస్సును పెంచడానికి మరియు ప్రతి మనిషికి సంబంధించిన ఆరోగ్య పరిరక్షణ కోసం ప్రతి ఒక్క శాస్త్రవేత్త కూడా ఎన్నో ప్రయోగాలు, ప్రయత్నాలు చేశారు.

చేస్తూనే ఉన్నారు.తాజాగా శాస్త్రవేత్తలు ఒక కీలక విషయాన్ని కనిపెట్టారు.జపాన్‌ దేశంలో అంతర్బాగమైన ఒక ద్వీపం ఒకినావా.ఈ ద్వీపంలో జనాబా చాలా తక్కువగా ఉంటుంది.

అయితే వారిలో ఎక్కువ శాతం మంది 90 నుండి 100 సంవత్సరాలు బతుకుతున్నారు.దాంతో వారి జీవన విధానం మరియు ఆహారపు అలవాట్లపై డీప్‌గా పరిశోదనలు చేసిన శాస్త్రవేత్తలు ఆసక్తికర విషయాన్ని కనిపెట్టారు.

ఒకినావా ప్రజలు ఎక్కువగా చిలగడ దుంపలను తింటున్నారట.వాటిలో ఉండే కార్బో హైడ్రడ్స్‌ మరియు ఇతర ప్రోటీన్‌లు అనారోగ్య సమస్యలను ఆమడ దూరంలో ఉంచుతున్నాయట.షుగర్‌ మరియు ఇతర దీర్ఘ కాలిక వ్యాదులను చిలగడ దుంపలు ఎక్కువగా నివారించడంతో పాటు, అవి రాకుండా రోగ నిరోదక శక్తిని పెంచుతాయట.ఈమద్య కాలంలో ఎక్కువగా అనారోగ్య కారణంలతో జనాలు చనిపోతున్నారు.

మనిషి శరీరంలో రోగ నిరోదక శక్తి ఎక్కువగా ఉంటే తప్పకుండా మనిషి ఎక్కువ కాలం బతికేస్తాడు.అందుకే చిలకగడ దుంపలో రోగ నిరోదక శక్తి ఎక్కువగా ఉండటం, వాటినే వారు ఎక్కువగా తినడం వల్ల ఎక్కువ సంవత్సరాలు బతికేస్తున్నారని శాస్త్రవేత్తలు కూడా నిర్థారించారు.మరెందుకు ఆలస్యం చిలగడ దుంపలను తేలికగా కొట్టి పారేయకుండా వీలున్నప్పుడల్లా తప్పకుండా మీరు తినండి, మీ కుటుంబ సభ్యులతో తినిపించండి.మీ సన్నిహితుల ఆరోగ్యంపై మీకు శ్రద్ద ఉంటే ఈ విషయాన్ని వారితో షేర్‌ చేసుకోండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube