ఎన్టీఆర్‌ గారి నిక్‌ నేమ్ ఏంటో తెలుసా.? ఆ పేరు ఎందుకు వచ్చిందో తెలుస్తే నవ్వుకుంటారు.!

నందమూరి ఎన్టీఆర్ అంటేనే భారతీయత ఉట్టిపడేలా ఉంటుంది.తెలుగుదనం ప్రత్యక్షంగా కనిపిస్తుంది.

 Senior Ntr Nickname In College Days-TeluguStop.com

తెలుగు జాతి ఉన్నంత వరకూ ఆయన ఖ్యాతి ఉంటూనే ఉంటుంది.తెలుగు చిత్ర సినిమాకి ఎంతో గుర్తింపు తెచ్చిన ఎన్టీఆర్ జీవిత చరిత్రని ఆయన తనయుడు హీరో ,ఎమ్మెల్యే అయిన నందమూరి బాలకృష్ణ బయోపిక్ రూపంలో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చి అలరించారు.

అన్న గారి పాత్రలో బాలయ్య బాబు గారు ఒదిగిపోయారు అంటున్నారు సినిమా చూసిన వారంతా.

ఇది ఇలా ఉండగా.

అన్న గారికి సంబందించిన ఓ ఆసక్తికర విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశం అయ్యింది.అదేంటి అంటే.

ఎన్టీఆర్‌ నిక్‌ నేమ్ ” మీసాల నాగమ్మ “ అంట.అసలు ఆయనకు ఆ పేరు ఎందుకు వచ్చింది అంటే.

చదువుకునే రోజుల్లోనే ఎన్టీఆర్‌కు కళలపట్ల మక్కువ ఎక్కువ.బెజ‌వాడ గ‌వ‌ర్నమెంటు కాలేజీలో ఆయన ఓసారి కళాశాల ఉత్సవాల్లో ఓ నాటకంలో నటించారట.అయితే అది మహిళ పాత్ర కావడం విశేషం.మహిళ పాత్ర పోషించడానికి ఒప్పుకున్నా… మీసాలు తీసేందుకు మాత్రం ఎన్టీఆర్ అస్సలు ఒప్పుకోలేదట.దీంతో ఆ నాటకంలో మీసాల‌తోనే ఎన్టీఆర్ న‌టించాడ‌ట‌.అప్పటి నుంచి అందరూ కాలేజీలో ఆయన్ను మీసాల నాగమ్మ అంటూ ఆటపట్టించేవారట.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube