యూజర్ల డేటా లీక్ !ఫేస్‌బుక్ కి భారీ జరిమానా ..?

సోషల్ మీడియా లో రారాజుగా ఉన్న ఫేస్ బుక్ … రోజు రోజుకి యూజర్ల నమ్మకాన్ని కోల్పోతోంది.ఈ మధ్య తరచు ఏదో ఒక వివాదంలో ఈ సామజిక దిగ్గజం వార్తల్లోకి ఎక్కుతూనే ఉంది.

 Facebook Was Faces Record Setting Fine Over Privacy Volations-TeluguStop.com

అసలు ఇప్పటికే… యూజ‌ర్ల‌ వ్య‌క్తిగత వివ‌రాల‌ను వారి అనుమ‌తి లేకుండా అమ్ముకుంది అనే విష‌యంపై ఫేస్‌బుక్ విచార‌ణ ఎదుర్కుంటూ… పరువు పోగొట్టుకుంది.ఈ క్ర‌మంలోనే త్వ‌ర‌లో ఆ సంస్థ‌కు మ‌రో ఝ‌ల‌క్ త‌గ‌ల‌నుంది.

ఆ సంస్థ‌పై అమెరికా ఫెడరల్ ట్రేడ్ కమిషన్ (ఎఫ్‌టీసీ) భారీ జ‌రిమానా విధించబోతున్నట్టు తెలుస్తోంది.!

అనేక అంతర్జాతీయ మీడియా సంస్థలు వెలువరిస్తున్న కథనాల ప్రకారం… యూజర్ల సమాచార గోప్యత నిబంధనల ఉల్లంఘన అంశంపై ఎఫ్‌టీసీ చేపట్టిన దర్యాప్తు చివరి దశకు చేరుకున్న నేపథ్యంలో ఫేస్‌బుక్‌పై భారీ మొత్తంలో జరిమానా విధించే అవకాశం ఉన్నట్లు తెలిసింది.2012లో ఎఫ్‌టీసీ సాఫ్ట్‌వేర్ దిగ్గజ సంస్థ గూగుల్‌పై 22.5 మిలియన్ డాలర్ల జరిమానా విధించగా, అంతకన్నా ఎక్కువగానే ఇప్పుడు ఫేస్‌బుక్‌పై జరిమానా విధించే అవకాశం ఉన్నట్లు తెలిసింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube